Koodudu raaraa imkam goradalela

కూడుదు రారా ఇఁకఁ గొరతలేల
Language

(॥పల్లవి॥)
కూడుదు రారా ఇఁకఁ గొరతలేల
వేడుకలు దైవారీ విడెమైనా నియ్యరా

(॥కూడు॥)
కద్దురా నీసుద్దులు కడఁగడల వింటిమి
వద్దురా యింతేల మమ్ము వలఁబెట్టేవు
ఇద్దరము వేగినంతా యిటువలె నుండఁగాను
నిద్దుర కన్నులఁ దేరీ నీవు నన్నుఁ జూడరా

(॥కూడు॥)
మేలురా నీగుణములు మిక్కిలిజాణ నౌదువు
యేలరా నావద్దనుండే యెంతసేసేవు
కేలు రాజసాన నీవు గిలిగించి పట్టితివి
చాలు రాయడిసేసి చన్నులు ముట్టకురా

(॥కూడు॥)
పోకురా ఇఁకనెక్కడా పొంచి నన్నుఁ గూడితివి
యీకురా పరకాంతల కిట్టి చనవు
చేకూర నన్నేలితివి శ్రీవేంకటేశుఁడ
నీకు రమణి నేనైతి నెయ్యమెల్లాఁ జూపరా

(||pallavi||)
kūḍudu rārā im̐kam̐ gŏradalela
veḍugalu daivārī viḍĕmainā niyyarā

(||kūḍu||)
kaddurā nīsuddulu kaḍam̐gaḍala viṁṭimi
vaddurā yiṁtela mammu valam̐bĕṭṭevu
iddaramu veginaṁtā yiḍuvalĕ nuṁḍam̐gānu
niddura kannulam̐ derī nīvu nannum̐ jūḍarā

(||kūḍu||)
melurā nīguṇamulu mikkilijāṇa nauduvu
yelarā nāvaddanuṁḍe yĕṁtasesevu
kelu rājasāna nīvu giligiṁchi paṭṭidivi
sālu rāyaḍisesi sannulu muṭṭagurā

(||kūḍu||)
pogurā im̐kanĕkkaḍā pŏṁchi nannum̐ gūḍidivi
yīgurā paragāṁtala kiṭṭi sanavu
segūra nannelidivi śhrīveṁkaḍeśhum̐ḍa
nīgu ramaṇi nenaidi nĕyyamĕllām̐ jūbarā