(॥పల్లవి॥)
కూడినవేళనే బాసగొనవలెను
వాడలు దిరిగితేనే వంచరాదు సుమ్మీ
(॥కూడి॥)
సిగ్గులువడుకువే చేపట్టి తీసితేను
వెగ్గళించినవ్వకువే వేఁడుకొంటేను
అగ్గమై నీయింటికి రమ్మననే రమణుని
నిగ్గులవెనక మరినేరరాదుసుమ్మీ
(॥కూడి॥)
కొంచకువే నీతోను కోరి మాటలాడితేను
వంచకువే శిరసు నీవాఁడసనఁగా
మంచము వేయవే నీమగనికిఁ బవ్వళించ
యించుక మఱచినాను యేఁకరేవుసుమ్మీ
(॥కూడి॥)
తరితీపు సేయకువే తగఁ గాఁగిలించుకొంటే
వరుస వెరగేఁటికే వావి చెప్పఁగా
ఇరవై శ్రీవేంకటేశుఁ డేలె నిన్నఁక మెచ్చవే
వొరసితే రతులిఁక వుడివోవుసుమ్మీ
(||pallavi||)
kūḍinaveḽane bāsagŏnavalĕnu
vāḍalu dirigidene vaṁcharādu summī
(||kūḍi||)
sigguluvaḍuguve sebaṭṭi tīsidenu
vĕggaḽiṁchinavvaguve vem̐ḍugŏṁṭenu
aggamai nīyiṁṭigi rammanane ramaṇuni
niggulavĕnaga marinerarādusummī
(||kūḍi||)
kŏṁchaguve nīdonu kori māḍalāḍidenu
vaṁchaguve śhirasu nīvām̐ḍasanam̐gā
maṁchamu veyave nīmaganigim̐ bavvaḽiṁcha
yiṁchuga maṟasinānu yem̐karevusummī
(||kūḍi||)
taridību seyaguve tagam̐ gām̐giliṁchugŏṁṭe
varusa vĕragem̐ṭige vāvi sĕppam̐gā
iravai śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnam̐ka mĕchchave
vŏraside radulim̐ka vuḍivovusummī