(॥పల్లవి॥)
కూడిన మీఁదను కొసరేలే
ఆడకు నిష్టూర మప్పటివలెను
(॥కూడి॥)
నెలువుఁడదివొ నిన్నుఁ జేరి వేఁడుకొనె
వలపని జోలిఁక వద్దేలే
పలుకవె యిఁక నీపంతము దీరెను
అలుకలు చెల్లవు అప్పటివలెను
(॥కూడి॥)
కాంతుఁడదివొ నిన్నుఁ గమ్మరఁ బిలిచీ
వంతులు వాసులు వద్దేలే
చెంతల నిలువవె చేఁతలు దక్కెను
అంత గొణఁగకువె అప్పటివలెను
(॥కూడి॥)
శ్రీవేంకటపతి చేతులు చాఁచీ
వావులడుగలనిఁక వద్దేలే
ఆవటించితి ఆలమేల్ మంగవు
ఆవెరపేఁటికి అప్పటివలెను
(||pallavi||)
kūḍina mīm̐danu kŏsarele
āḍagu niṣhṭūra mappaḍivalĕnu
(||kūḍi||)
nĕluvum̐ḍadivŏ ninnum̐ jeri vem̐ḍugŏnĕ
valabani jolim̐ka vaddele
palugavĕ yim̐ka nībaṁtamu dīrĕnu
alugalu sĕllavu appaḍivalĕnu
(||kūḍi||)
kāṁtum̐ḍadivŏ ninnum̐ gammaram̐ bilisī
vaṁtulu vāsulu vaddele
sĕṁtala niluvavĕ sem̐talu dakkĕnu
aṁta gŏṇam̐gaguvĕ appaḍivalĕnu
(||kūḍi||)
śhrīveṁkaḍabadi sedulu sām̐sī
vāvulaḍugalanim̐ka vaddele
āvaḍiṁchidi ālamel maṁgavu
āvĕrabem̐ṭigi appaḍivalĕnu