Koodina meemdada mari korademtige

కూడిన మీఁదట మరి కొరతేఁటికే
Language

(॥పల్లవి॥)
కూడిన మీఁదట మరి కొరతేఁటికే
యీడులేదు ఇన్నిటా మీయిద్దరికిఁ జుమ్మీ

(॥కూడి॥)
చక్కెరవంటి మాటలు సారెసారె నాడఁగాను
ఇక్కువలకుఁ దీపెక్కె నీ విభునికి
చెక్కునొక్కి ఇఁకఁ జప్పఁ జేయక కాఁగిలించితే
పక్కనను చెఱకున పండు వండుఁజుమ్మీ

(॥కూడి॥)
పన్నీరువంటిమోహము పతిపైనే చల్లఁగాను
వెన్నెలతేటలువాకె వీడు దోడుగ
ఇన్నిటా నిఁక విరహపు టెండలు గాయకుండితే
పన్నినరతి కప్రపుపంట పండుఁజుమ్మీ

(॥కూడి॥)
చిగురువంటి ప్రియాన శ్రీవేంకటేశుఁ గూడఁగా
తగులెల్లు గురులాయ తతి మీలోన
పొగరుభోగములనుఁ బొదిగి పోదిసేసితే
పగటునవరసాలపంట వండుఁజుమ్మీ

(||pallavi||)
kūḍina mīm̐daḍa mari kŏradem̐ṭige
yīḍuledu inniḍā mīyiddarigim̐ jummī

(||kūḍi||)
sakkĕravaṁṭi māḍalu sārĕsārĕ nāḍam̐gānu
ikkuvalagum̐ dībĕkkĕ nī vibhunigi
sĕkkunŏkki im̐kam̐ jappam̐ jeyaga kām̐giliṁchide
pakkananu sĕṟaguna paṁḍu vaṁḍum̐jummī

(||kūḍi||)
pannīruvaṁṭimohamu padibaine sallam̐gānu
vĕnnĕladeḍaluvāgĕ vīḍu doḍuga
inniḍā nim̐ka virahabu ṭĕṁḍalu gāyaguṁḍide
panninaradi kaprabubaṁṭa paṁḍum̐jummī

(||kūḍi||)
siguruvaṁṭi priyāna śhrīveṁkaḍeśhum̐ gūḍam̐gā
tagulĕllu gurulāya tadi mīlona
pŏgarubhogamulanum̐ bŏdigi podiseside
pagaḍunavarasālabaṁṭa vaṁḍum̐jummī