Koodimaadi padivaddam goosumdave

కూడిమాడి పతివద్దఁ గూచుండవే
Language

(॥పల్లవి॥)
కూడిమాడి పతివద్దఁ గూచుండవే
జీడి వంటిది వలపు సిగ్గు లింక నేలే

(॥॥)
మనసు రేఁచఁగవచ్చు మక్కువ లణఁచ రాదు
కనుఁగొన దొరకొంటే కాంక్ష దీరదు
తనువు సోఁకించవచ్చు తమి మాన్ప పసగాదు
చెనకి విభుని తోఁడ సిగ్గు లింక నేలే

(॥॥)
వేమరు నవ్వఁగవచ్చు విరహము పట్టరాదు
ప్రేమము చల్లితే నాస పిరి తియ్యదు
ఆముకోఁ గదిసి మరి దీమసము పనిలేదు
చేముంచెఁ బను లెల్లాను సిగ్గు లింక నేలే

(॥॥)
సరసములాడవచ్చు చవులు విడువరాదు
మరిగిన మీఁదట మఱుఁగు లేదు
వరుస తో శ్రీ వేంకటేశ్వరుఁడు నిన్నుఁగూడె
సిరులఁ బెండ్లాడితివి సిగ్గు లింక నేలే

(||pallavi||)
kūḍimāḍi padivaddam̐ gūsuṁḍave
jīḍi vaṁṭidi valabu siggu liṁka nele

(||||)
manasu rem̐sam̐gavachchu makkuva laṇam̐sa rādu
kanum̐gŏna dŏragŏṁṭe kāṁkṣha dīradu
tanuvu som̐kiṁchavachchu tami mānpa pasagādu
sĕnagi vibhuni tom̐ḍa siggu liṁka nele

(||||)
vemaru navvam̐gavachchu virahamu paṭṭarādu
premamu sallide nāsa piri tiyyadu
āmugom̐ gadisi mari dīmasamu paniledu
semuṁchĕm̐ banu lĕllānu siggu liṁka nele

(||||)
sarasamulāḍavachchu savulu viḍuvarādu
marigina mīm̐daḍa maṟum̐gu ledu
varusa to śhrī veṁkaḍeśhvarum̐ḍu ninnum̐gūḍĕ
sirulam̐ bĕṁḍlāḍidivi siggu liṁka nele