Koodidi riddaru meeru komdagomdavale

కూడితి రిద్దరు మీరు కొండగొండవలె
Language

(॥పల్లవి॥)
కూడితి రిద్దరు మీరు కొండగొండవలె
మోడామోడిమాఁటల ముచ్చట దీరీనా

(॥ఏమ॥)
నిలుచున్నాఁడతడు నీమీఁది మోహమున
పిలువవే ఇకనైనాఁ బ్రియమురాలవు
చెలులు యెడమాటులు చెప్పిరాగా మాపుదాకా
తలఁపులలో నీతహతహ వాసీనా

(॥ఏమ॥)
నవ్వు నవ్వీ నాతఁడు ననుపైనచనవున
ఇవ్వల నెదురుకోవే హితురాలవు
రవ్వగా నొద్దికవారలు రాయబారాలు సేసితే
జవ్వనపు మదాలగజరు దీరీనా

(॥ఏమ॥)
దగ్గరివచ్చెనాతఁడు తమితోఁగూడేనంటా
కగ్గ కా శ్రీవేంకటేశుఁ గాఁగిలించవే
తగ్గ కూడిగపువారుామేంత పచ్చి చేసినా
యెగ్గు లేని మీరతికి నీడువచ్చీనా

(||pallavi||)
kūḍidi riddaru mīru kŏṁḍagŏṁḍavalĕ
moḍāmoḍimām̐ṭala muchchaḍa dīrīnā

(||ema||)
nilusunnām̐ḍadaḍu nīmīm̐di mohamuna
piluvave iganainām̐ briyamurālavu
sĕlulu yĕḍamāḍulu sĕppirāgā mābudāgā
talam̐pulalo nīdahadaha vāsīnā

(||ema||)
navvu navvī nādam̐ḍu nanubainasanavuna
ivvala nĕdurugove hidurālavu
ravvagā nŏddigavāralu rāyabārālu seside
javvanabu madālagajaru dīrīnā

(||ema||)
daggarivachchĕnādam̐ḍu tamidom̐gūḍenaṁṭā
kagga kā śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchave
tagga kūḍigabuvāruాmeṁta pachchi sesinā
yĕggu leni mīradigi nīḍuvachchīnā