కూడి సుఖించుటకంటె కూడుదమనేదే ఇంపు
(॥పల్లవి॥)
కూడి సుఖించుటకంటె కూడుదమనేదే ఇంపు
తాడుపడి వుండుకంటే తరితీపే ఇంపు
(॥కూడి॥)
దగ్గరి వుండుటకంటే దవ్వుల నినుఁ దలఁచి
అగ్గలపురతిఁ జొక్కే ఆసలే ఇంపు
సగ్గక పానుపుమీఁద చలివాసి వుండుకంటె
సిగ్గుతోడఁ గొనచూపు చిమ్ముటే ఇంపు
(॥కూడి॥)
సరికి జేసికి నీతో సరసములాడుకంటె
మరుగుచునుండే యెడమాటలే ఇంపు
సరుగ నీ మీఁద జేయి చాఁచి కాఁకఁదీరుకంటె
వరుసఁ బూవుల చెండువాట్లే ఇంపు
(॥కూడి॥)
అగవడ్డరతులచే నలసి నిద్రించుకంటె
దిగువుఁ గాఁగిటిలోని ప్రియమే ఇంపు
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
పగటుల నుండుకంటే పచ్చిసేయు టింపు
(||pallavi||)
kūḍi sukhiṁchuḍagaṁṭĕ kūḍudamanede iṁpu
tāḍubaḍi vuṁḍugaṁṭe taridībe iṁpu
(||kūḍi||)
daggari vuṁḍuḍagaṁṭe davvula ninum̐ dalam̐si
aggalaburadim̐ jŏkke āsale iṁpu
saggaga pānubumīm̐da salivāsi vuṁḍugaṁṭĕ
siggudoḍam̐ gŏnasūbu simmuḍe iṁpu
(||kūḍi||)
sarigi jesigi nīdo sarasamulāḍugaṁṭĕ
marugusunuṁḍe yĕḍamāḍale iṁpu
saruga nī mīm̐da jeyi sām̐si kām̐kam̐dīrugaṁṭĕ
varusam̐ būvula sĕṁḍuvāṭle iṁpu
(||kūḍi||)
agavaḍḍaradulase nalasi nidriṁchugaṁṭĕ
diguvum̐ gām̐giḍiloni priyame iṁpu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
pagaḍula nuṁḍugaṁṭe pachchiseyu ṭiṁpu