కూడేవేళ లేని సిగ్గు కొలులో వచ్చెనా
(॥పల్లవి॥)
కూడేవేళ లేని సిగ్గు కొలులో వచ్చెనా
వేడుక వలపు వెల్లవిరి సేయరాదా
(॥కూడే॥)
యెదట నున్నది చెలి యెక్కడ పరాకు నీకు
అదివో వద్దఁ గూచుండు మనఁగరాదా
పెదవుల గదలించీ ప్రియము చెప్పీనేవమో
అదనుగా వీను లోగ్గి ఆలకించరాదా
(॥కూడే॥)
చేతికి వీడె మియ్యఁగా శిరసేల వంచేవు
కాతరాన నందుకోని కలయరాదా
యీతల నిన్నే చూచీ యెంతపని గలిగెనో
ఆతలుపేఁటిదో నీ వడుగఁగరాదా
(॥కూడే॥)
మొక్కీ నీకు సారె నాపె మోహ మేల దాఁచేవు
చిక్కి శ్రీవేంకటేశ్వర చేకొనరాదా
అక్కన నలమేల్మంగనైన నన్నుఁ గూడితివి
దక్కితివి నీవు నాకు తన్నుఁ బిలువరాదా
(||pallavi||)
kūḍeveḽa leni siggu kŏlulo vachchĕnā
veḍuga valabu vĕllaviri seyarādā
(||kūḍe||)
yĕdaḍa nunnadi sĕli yĕkkaḍa parāgu nīgu
adivo vaddam̐ gūsuṁḍu manam̐garādā
pĕdavula gadaliṁchī priyamu sĕppīnevamo
adanugā vīnu loggi ālagiṁcharādā
(||kūḍe||)
sedigi vīḍĕ miyyam̐gā śhirasela vaṁchevu
kādarāna naṁdugoni kalayarādā
yīdala ninne sūsī yĕṁtabani galigĕno
ādalubem̐ṭido nī vaḍugam̐garādā
(||kūḍe||)
mŏkkī nīgu sārĕ nābĕ moha mela dām̐sevu
sikki śhrīveṁkaḍeśhvara segŏnarādā
akkana nalamelmaṁganaina nannum̐ gūḍidivi
dakkidivi nīvu nāgu tannum̐ biluvarādā