కొన్నదె కొనఁగఁబోతే కోపము సరకుగాదు
(॥పల్లవి॥)
కొన్నదె కొనఁగఁబోతే కోపము సరకుగాదు
వన్నెమీఁద వన్నెలేలే వాసు లివి చాలదా
(॥కొన్నా॥)
మోపులుగా మాటలన్ని మూఁటగట్టివేసీని
అఁప లేజవ్వనభార మది చాలదా
పూఁపవలపులు నాపై పొద్దువొద్దుఁ బూసీని
పోపో విరహపుఁగాఁక పూసె నాఁడే చాలదా
(॥కొన్నా॥)
కన్నుచూపు నెఱుఁగులగంపఁ గమ్మీ నన్ను నిట్టె
యెన్నికె గంపంతకొప్పు ఇది చాలదా
కన్నెపచ్చి సేఁతలనే కలగూర లేరీని
వున్నది నామేనఁ బచ్చి వూరకింత చాలదా
(॥కొన్నా॥)
తనతో నవ్వఁగఁబోతే తరితీపుసేసీని
దినము నామోవిమీఁదితీపు చాలదా
యెనయ శ్రీ వేంకటేశుఁ డివు డిట్టె నన్నుఁ గూడె
మనసిచ్చితి నలమేల్మంగ నేనే చాలదా
(||pallavi||)
kŏnnadĕ kŏnam̐gam̐bode kobamu saragugādu
vannĕmīm̐da vannĕlele vāsu livi sāladā
(||kŏnnā||)
mobulugā māḍalanni mūm̐ṭagaṭṭivesīni
am̐pa lejavvanabhāra madi sāladā
pūm̐pavalabulu nābai pŏdduvŏddum̐ būsīni
pobo virahabum̐gām̐ka pūsĕ nām̐ḍe sāladā
(||kŏnnā||)
kannusūbu nĕṟum̐gulagaṁpam̐ gammī nannu niṭṭĕ
yĕnnigĕ gaṁpaṁtagŏppu idi sāladā
kannĕbachchi sem̐talane kalagūra lerīni
vunnadi nāmenam̐ bachchi vūragiṁta sāladā
(||kŏnnā||)
tanado navvam̐gam̐bode taridībusesīni
dinamu nāmovimīm̐didību sāladā
yĕnaya śhrī veṁkaḍeśhum̐ ḍivu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
manasichchidi nalamelmaṁga nene sāladā