Koniyaademe ninnu kottalugaanu

కొనియాడేమే నిన్ను కొత్తలుగాను
Language

(॥పల్లవి॥)
కొనియాడేమే నిన్ను కొత్తలుగాను
చనవరి వైనందుకు సరివచ్చె నిపుడు

(॥॥)
ఇప్పుడేమాయనే ఇదిగో ఆతఁడున్నాడు
చిప్పిల నీపంతము చెల్లించుకోవే
చెప్పుకొన నేఁటికే చెలరేఁగి నీయెమ్మెలు
తప్పక చూచినందే తారుకాణ గంటిమే

(॥॥)
కాదనేనటవే కదిసెను రమణుఁడు
పాదుగా నీయిచ్చలను బాసగొనవే
తోదోపు లేఁటికే తొక్కితివి పాదము
ఆదరించినప్పుడే ఆయాలు గరఁగెనే

(॥॥)
చెల్లదటవే నీవుచేసినచేఁతలెల్లా
యిల్లిదె శ్రీవేంకటేశు నిట్టె కూడవే
పల్లదాలేఁటికే నన్ను బైకొని యీతఁడె కూడె
వొల్లనే నే నవ్వితేనే వొడఁబాటులాయనే

(||pallavi||)
kŏniyāḍeme ninnu kŏttalugānu
sanavari vainaṁdugu sarivachchĕ nibuḍu

(||||)
ippuḍemāyane idigo ādam̐ḍunnāḍu
sippila nībaṁtamu sĕlliṁchugove
sĕppugŏna nem̐ṭige sĕlarem̐gi nīyĕmmĕlu
tappaga sūsinaṁde tārugāṇa gaṁṭime

(||||)
kādanenaḍave kadisĕnu ramaṇum̐ḍu
pādugā nīyichchalanu bāsagŏnave
todobu lem̐ṭige tŏkkidivi pādamu
ādariṁchinappuḍe āyālu garam̐gĕne

(||||)
sĕlladaḍave nīvusesinasem̐talĕllā
yillidĕ śhrīveṁkaḍeśhu niṭṭĕ kūḍave
palladālem̐ṭige nannu baigŏni yīdam̐ḍĕ kūḍĕ
vŏllane ne navvidene vŏḍam̐bāḍulāyane