కోనే ఉద్దండను నీకు కోరికె లెల్లాఁ జెల్లె
(॥పల్లవి॥)
కోనే ఉద్దండను నీకు కోరికె లెల్లాఁ జెల్లె
పూని సర్వసంపదల పురుషోత్తమా
(॥కోనే॥)
అదనఁ గప్పురకాపు అవధరించేవేళ
అదివో నారాయణత్వ మమరె నీకు
నిదుల నేకోదకము నీరూపమే కనక
పొదలుచు నిదివల్లఁ బుట్టే నీజగము
(॥కోనే॥)
ఆరీతిఁ గప్పురకాపు అవధరించేవేళ
క్షీరాబ్దిశాయి వనుటఁ జెల్లెను నీకు
తేరిపాలఁ బుట్టెను నీదేవులమహిమ గన
ఆరయఁ బాలే జీవుల కాధార మాయను
(॥కోనే॥)
నీతట్టు పుణుఁగువేళ నీలవర్ణనామ మబ్బె
ఘత నల్లనిరాత్రిఁ బగలునీమేను
ఆతుమ శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
నీతి నుర మెక్కిఁ గన నిండె సొమ్ము లెల్లను
(||pallavi||)
kone uddaṁḍanu nīgu korigĕ lĕllām̐ jĕllĕ
pūni sarvasaṁpadala puruṣhottamā
(||kone||)
adanam̐ gappuragābu avadhariṁcheveḽa
adivo nārāyaṇatva mamarĕ nīgu
nidula negodagamu nīrūbame kanaga
pŏdalusu nidivallam̐ buṭṭe nījagamu
(||kone||)
ārīdim̐ gappuragābu avadhariṁcheveḽa
kṣhīrābdiśhāyi vanuḍam̐ jĕllĕnu nīgu
teribālam̐ buṭṭĕnu nīdevulamahima gana
ārayam̐ bāle jīvula kādhāra māyanu
(||kone||)
nīdaṭṭu puṇum̐guveḽa nīlavarṇanāma mabbĕ
ghada nallanirātrim̐ bagalunīmenu
āduma śhrīveṁkaḍeśha alamelumaṁga nīgu
nīdi nura mĕkkim̐ gana niṁḍĕ sŏmmu lĕllanu