కొనరమ్మ యింతులాల కుప్పలాయ వలపు
(॥పల్లవి॥)
కొనరమ్మ యింతులాల కుప్పలాయ వలపు
పొనుఁగక పోఁకకు పుట్టెఁడాయ వలపు
(॥కొన॥)
పిల్లఁగోవిరాగాలఁ బెనగోనె వలపు
చల్లచాడెతలల జాజుకొనె వలపు
మొల్లమినివ్వెరగులై ముంచుకొనె వలపు
అల్లదివో రేపల్లె అగ్గువాయ వలపు
(॥కొన॥)
కొలనిదండ నోముల గుదిగొనె వలపు
వెలలేనిజాగరాల వేడుకాయ వలపు
తోలఁగుసిగ్గుల నూరదోమటాయ వలపు
అలరి దొడ్డిసెంటల నామనాయ వలపు
(॥కొన॥)
బావించి యలమేల్‌మంగపతిఁ గూడె వలపు
శ్రీవేంకటగిరిమీఁద జిమ్మిరేఁగే వలపు
కైవసమై యీకృష్ణుఁడు కాంతలాల మిమ్ముఁ గూడె
తావుల నుండఁగానే దారణెక్కె వలపు
(||pallavi||)
kŏnaramma yiṁtulāla kuppalāya valabu
pŏnum̐gaga pom̐kagu puṭṭĕm̐ḍāya valabu
(||kŏna||)
pillam̐govirāgālam̐ bĕnagonĕ valabu
sallasāḍĕdalala jājugŏnĕ valabu
mŏllaminivvĕragulai muṁchugŏnĕ valabu
alladivo reballĕ agguvāya valabu
(||kŏna||)
kŏlanidaṁḍa nomula gudigŏnĕ valabu
vĕlalenijāgarāla veḍugāya valabu
tolam̐gusiggula nūradomaḍāya valabu
alari dŏḍḍisĕṁṭala nāmanāya valabu
(||kŏna||)
bāviṁchi yalamelmaṁgabadim̐ gūḍĕ valabu
śhrīveṁkaḍagirimīm̐da jimmirem̐ge valabu
kaivasamai yīkṛṣhṇum̐ḍu kāṁtalāla mimmum̐ gūḍĕ
tāvula nuṁḍam̐gāne dāraṇĕkkĕ valabu