కొనకెక్కె వలపులు గోపీనాథ । మన
(॥పల్లవి॥)
కొనకెక్కె వలపులు గోపీనాథ । మన-
మనసాక్కటాయ నింక మదనగోపీనాథా
(॥కొన॥)
కొమ్మరుపదారువేల గోపీనాథా । నీకు
గుమ్మెలాయ మోమెల్ల గోపీనాథా
కుమ్మరింపురాగాల గోపీనాథా । అంత
చిమ్మకు నీవంతములు చిన్నిగోపీనాథా
(॥కొన॥)
కోరినకోరికె చెల్లె గోపీనాథా । యింకాఁ
గూరిమేల కొనరేవు గోపీనాథా
గోరు సోఁక నీయకు మీ గోపీనాథా । సమ -
తారుకాణలాయ నిన్నీఁ దగు గోపీనాథా
(॥కొన॥)
కొండుకపాయాలు సరి గోపీనాథా । యిఁక
గుండెపట్టి వుండరాదా గోపీనాథా
కొండల శ్రీవేంకటాద్రి గోపీనాథా । పొందు
తొండమారేళ్ల గూడె దొర గోపీనాథా
(||pallavi||)
kŏnagĕkkĕ valabulu gobīnātha | mana-
manasākkaḍāya niṁka madanagobīnāthā
(||kŏna||)
kŏmmarubadāruvela gobīnāthā | nīgu
gummĕlāya momĕlla gobīnāthā
kummariṁpurāgāla gobīnāthā | aṁta
simmagu nīvaṁtamulu sinnigobīnāthā
(||kŏna||)
korinagorigĕ sĕllĕ gobīnāthā | yiṁkām̐
gūrimela kŏnarevu gobīnāthā
goru som̐ka nīyagu mī gobīnāthā | sama -
tārugāṇalāya ninnīm̐ dagu gobīnāthā
(||kŏna||)
kŏṁḍugabāyālu sari gobīnāthā | yim̐ka
guṁḍĕbaṭṭi vuṁḍarādā gobīnāthā
kŏṁḍala śhrīveṁkaḍādri gobīnāthā | pŏṁdu
tŏṁḍamāreḽla gūḍĕ dŏra gobīnāthā