కొంతవడి వుండవయ్యా కోరినట్టె అయ్యీఁ గాని
(॥పల్లవి॥)
కొంతవడి వుండవయ్యా కోరినట్టె అయ్యీఁ గాని
కాంతుఁడవు ఇంత పెనఁగకువయ్య యిపుడు
(॥కొంత॥)
కావించి పొగడేవు చక్కనిదాననంటాను
నీవాడేమాఁటలకు నేనా గురి
చేవదేరి యిందుకుఁగా సిగ్గువడి వున్నదాన
కావరించి నన్నుఁ జెనకకువయ్య యిపుడు
(॥కొంత॥)
చేరి నాగుణానకు మెచ్చితినంటాఁ జేకొనేవు
నేరుపు నీకతలకు నేనా గురి
సారెకు నిందుకుఁగా వంచనతో నేనున్నదాన
ఆరీతిఁ గొంగువట్టి తియ్యకువయ్య ఇపుడు
(॥కొంత॥)
అప్పటి నీ దేవుల నే నంటాఁ గాఁగిలించేవు
నెప్పున నీమన్ననకు నేనా గురి
యిప్పుడే శ్రీ వేంకటేశ యిందుఁ జొక్కి వుందాన
దప్పిదేరి నీగోర నూఁదకువయ్య యిపుడు
(||pallavi||)
kŏṁtavaḍi vuṁḍavayyā korinaṭṭĕ ayyīm̐ gāni
kāṁtum̐ḍavu iṁta pĕnam̐gaguvayya yibuḍu
(||kŏṁta||)
kāviṁchi pŏgaḍevu sakkanidānanaṁṭānu
nīvāḍemām̐ṭalagu nenā guri
sevaderi yiṁdugum̐gā sigguvaḍi vunnadāna
kāvariṁchi nannum̐ jĕnagaguvayya yibuḍu
(||kŏṁta||)
seri nāguṇānagu mĕchchidinaṁṭām̐ jegŏnevu
nerubu nīgadalagu nenā guri
sārĕgu niṁdugum̐gā vaṁchanado nenunnadāna
ārīdim̐ gŏṁguvaṭṭi tiyyaguvayya ibuḍu
(||kŏṁta||)
appaḍi nī devula ne naṁṭām̐ gām̐giliṁchevu
nĕppuna nīmannanagu nenā guri
yippuḍe śhrī veṁkaḍeśha yiṁdum̐ jŏkki vuṁdāna
dappideri nīgora nūm̐daguvayya yibuḍu