కొంత గుండెవట్టుకొని కోరికెతో నుండుఁ గాని
(॥పల్లవి॥)
కొంత గుండెవట్టుకొని కోరికెతో నుండుఁ గాని
చెంతనుండి వొకమాఁటు చే చాచఁరాదా
(॥కొంత॥)
ఆసతో నప్పటనుండి అతివ గొలువుసేసె
రాసికెక్క నింటికి రమ్మనరాదా
మోసులుగఁ జేయెత్తి మొక్కెనప్పటనుండి
సేసవెట్టేనని మాఁట చెప్పఁగరాదా
(॥కొంత॥)
బత్తితో నీమేను ముట్టె పడఁతి సింగారించి
సత్తుగా మోముచూచి మెచ్చఁగరాదా
కొత్తలైన నీపొందులుగోరి సరసములాడె
పొత్తుల బువ్వములిచ్చి పొదుగఁగరాదా
(॥కొంత॥)
వేడుకతో మోవితేనె విందులు సారెకుఁ బెట్టె
కూడి యిట్టే కాఁగిలించుకొనరాదా
యీడనే శ్రీవేంకటేశ యెనసి నిన్నుఁబెండ్లాడె
వోడక సమరతులనూరడించరాదా
(||pallavi||)
kŏṁta guṁḍĕvaṭṭugŏni korigĕdo nuṁḍum̐ gāni
sĕṁtanuṁḍi vŏgamām̐ṭu se sāsam̐rādā
(||kŏṁta||)
āsado nappaḍanuṁḍi adiva gŏluvusesĕ
rāsigĕkka niṁṭigi rammanarādā
mosulugam̐ jeyĕtti mŏkkĕnappaḍanuṁḍi
sesavĕṭṭenani mām̐ṭa sĕppam̐garādā
(||kŏṁta||)
battido nīmenu muṭṭĕ paḍam̐ti siṁgāriṁchi
sattugā momusūsi mĕchcham̐garādā
kŏttalaina nībŏṁdulugori sarasamulāḍĕ
pŏttula buvvamulichchi pŏdugam̐garādā
(||kŏṁta||)
veḍugado movidenĕ viṁdulu sārĕgum̐ bĕṭṭĕ
kūḍi yiṭṭe kām̐giliṁchugŏnarādā
yīḍane śhrīveṁkaḍeśha yĕnasi ninnum̐bĕṁḍlāḍĕ
voḍaga samaradulanūraḍiṁcharādā