కొమ్మచే నేమి సేయించుకొంటివయ్యా
(॥పల్లవి॥)
కొమ్మచే నేమి సేయించుకొంటివయ్యా
కమ్మటిఁ దామొక్కినట్టి కారణ మేమయ్యా
(॥కొమ్మ॥)
వెలఁది విన్నపములు వేమారుఁ జేసీ నీకు
సొలపుఁ జూపుల నిన్నుఁ జూచి చూచి
చెలరేఁగి యప్పటి నీచెక్కు నొక్కి వేఁడుకొనె
యెలమి మీ ముసగమ లేఁటివయ్యా
(॥కొమ్మ॥)
వింతగా నిన్ను నవ్వించి వేడుక లెల్లాఁ బుట్టించె
చెంతనుండి కొనగోరఁ జిమ్మి చిమ్మి
పంతపుగుబ్బల నొత్తి బలిమిఁ గాఁగిట నించె
అంతలేసి నీపను లవి యేఁటివయ్యా
(॥కొమ్మ॥)
కప్పురపులప్ప నీకుఁ గానుకగాఁ జేతికిచ్చె
చొప్పుగాఁ బ్రియాలు మోవిఁ జాసి చూపి
ఇప్పుడె శ్రీవేంకటేశ యిటు నన్నుణగూడితివి
అప్పటి నీసుద్దుల నెయ్యము లేఁటివయ్యా
(||pallavi||)
kŏmmase nemi seyiṁchugŏṁṭivayyā
kammaḍim̐ dāmŏkkinaṭṭi kāraṇa memayyā
(||kŏmma||)
vĕlam̐di vinnabamulu vemārum̐ jesī nīgu
sŏlabum̐ jūbula ninnum̐ jūsi sūsi
sĕlarem̐gi yappaḍi nīsĕkku nŏkki vem̐ḍugŏnĕ
yĕlami mī musagama lem̐ṭivayyā
(||kŏmma||)
viṁtagā ninnu navviṁchi veḍuga lĕllām̐ buṭṭiṁchĕ
sĕṁtanuṁḍi kŏnagoram̐ jimmi simmi
paṁtabugubbala nŏtti balimim̐ gām̐giḍa niṁchĕ
aṁtalesi nībanu lavi yem̐ṭivayyā
(||kŏmma||)
kappurabulappa nīgum̐ gānugagām̐ jedigichchĕ
sŏppugām̐ briyālu movim̐ jāsi sūbi
ippuḍĕ śhrīveṁkaḍeśha yiḍu nannuṇagūḍidivi
appaḍi nīsuddula nĕyyamu lem̐ṭivayyā