కొమ్మలు పదారువేల గోవిందరాజ
(॥పల్లవి॥)
కొమ్మలు పదారువేల గోవిందరాజ
నిమ్మపంట వేతురా నీ వాఁటదానిని
(॥కొమ్మ॥)
చేరి కొంగువట్టెనంటాఁ జెలులతోఁ జెప్పి చెప్పి
ఆరీతి నవ్వుదురా ఆఁటదానిని
కోరి చెమటదీసితే కొనగోరు దాఁకెనంటా
నేరము లెన్నుదురా నీవాఁటదానిని
(॥కొమ్మ॥)
సన్నలఁ జిక్కించెనంటా సాకిరులు వెట్టివెట్టి
అన్నిటా దూరుదురా అఁటదానిని
చన్నులుసోఁకఁగ నీసరుసఁ గూచుండెనంటా
నిన్నటికి నేఁ డందురా నీవాఁటదానిని
(॥కొమ్మ॥)
జట్టిగొని కూడెనంటా సముకాన మెచ్చిమెచ్చి
అట్టె పొగడుదురా అఁటదానిని
వొట్టుక శ్రీవేంకటేశ వుర మొక్కించుకొంటివి
నెట్టన నింతసేతురా నీ వాఁటదానిని
(||pallavi||)
kŏmmalu padāruvela goviṁdarāja
nimmabaṁṭa vedurā nī vām̐ṭadānini
(||kŏmma||)
seri kŏṁguvaṭṭĕnaṁṭām̐ jĕluladom̐ jĕppi sĕppi
ārīdi navvudurā ām̐ṭadānini
kori sĕmaḍadīside kŏnagoru dām̐kĕnaṁṭā
neramu lĕnnudurā nīvām̐ṭadānini
(||kŏmma||)
sannalam̐ jikkiṁchĕnaṁṭā sāgirulu vĕṭṭivĕṭṭi
anniḍā dūrudurā am̐ṭadānini
sannulusom̐kam̐ga nīsarusam̐ gūsuṁḍĕnaṁṭā
ninnaḍigi nem̐ ḍaṁdurā nīvām̐ṭadānini
(||kŏmma||)
jaṭṭigŏni kūḍĕnaṁṭā samugāna mĕchchimĕchchi
aṭṭĕ pŏgaḍudurā am̐ṭadānini
vŏṭṭuga śhrīveṁkaḍeśha vura mŏkkiṁchugŏṁṭivi
nĕṭṭana niṁtasedurā nī vām̐ṭadānini