Kommalu paadaalottamgaa govimdumdu

కొమ్మలు పాదాలొత్తఁగా గోవిందుఁడు
Language

(॥పల్లవి॥)
కొమ్మలు పాదాలొత్తఁగా గోవిందుఁడు
యెమ్మెలకే పవళించె నిదివో గోవిందుఁడు

(॥కొమ్మ॥)
సరిగా గొల్లెతలతో సరసాలాడి యలసి
నిరతితోఁ బవళించె నేఁడు గోవిందుఁడు
అరసి బృందావనాన ఆవులఁ గాచి వచ్చి
ఇరవుగఁ బవళించె నిదివో గోవిందుఁడు

(॥కొమ్మ॥)
కదిసి గోపాలులతో కచ్చకాయ లాడివచ్చి
గుదిగొనఁ బవళించె గోవిందుఁడు
మొదల గోవర్ధనాద్రి మోఁపు మోఁచి వచ్చి నేఁడు
యెదుటనే పవళించె నిదివో గోవిందుఁడు

(॥కొమ్మ॥)
నించి శ్రీ వేంకటాద్రిని నిలిచిందుఁ బవళించె
కొంచక తిరుపతిలో గోవిందుఁడు
అంచెలఁ బదారువేల నలమి వారివరుస
లెంచుకొంటాఁ బవళించె నిదివో గోవిందుఁడు

(||pallavi||)
kŏmmalu pādālŏttam̐gā goviṁdum̐ḍu
yĕmmĕlage pavaḽiṁchĕ nidivo goviṁdum̐ḍu

(||kŏmma||)
sarigā gŏllĕdalado sarasālāḍi yalasi
niradidom̐ bavaḽiṁchĕ nem̐ḍu goviṁdum̐ḍu
arasi bṛṁdāvanāna āvulam̐ gāsi vachchi
iravugam̐ bavaḽiṁchĕ nidivo goviṁdum̐ḍu

(||kŏmma||)
kadisi gobālulado kachchagāya lāḍivachchi
gudigŏnam̐ bavaḽiṁchĕ goviṁdum̐ḍu
mŏdala govardhanādri mom̐pu mom̐si vachchi nem̐ḍu
yĕduḍane pavaḽiṁchĕ nidivo goviṁdum̐ḍu

(||kŏmma||)
niṁchi śhrī veṁkaḍādrini nilisiṁdum̐ bavaḽiṁchĕ
kŏṁchaga tirubadilo goviṁdum̐ḍu
aṁchĕlam̐ badāruvela nalami vārivarusa
lĕṁchugŏṁṭām̐ bavaḽiṁchĕ nidivo goviṁdum̐ḍu