Kommalagu manobhaavagum damduru

కొమ్మలకు మనోభావకుఁ డందురు
Language

(॥పల్లవి॥)
కొమ్మలకు మనోభావకుఁ డందురు
సమ్మతించ మాకు దిష్టము చూపరాదా

(॥కొమ్మ॥)
మగువ కోరికలనే మనసునఁ బాలు దాగె
జిగి నీవెన్నేని లెక్కచెప్పవయ్యా
నగవులకప్పురము నంటున బేరాలాడె
వెగటులేక నీవు వెల దీర్చరాదా

(॥కొమ్మ॥)
జలజాక్షి జవ్వనము చన్నులఁ గుప్పలు వోసె
యెలమిఁ గోరుపా లందునేమయ్యా
కలికి కన్నులనే కలువలఁ బూజసేసె
ఫల మెంత ఇచ్చేవు పచరించరాదా

(॥కొమ్మ॥)
మానిని సిగ్గులనే మర్మములు నిన్నడిగి
ఆనతిచ్చి మెచ్చులు నీవందవయ్యా
పూనిక శ్రీవేంకటేశ పొందులు మీకిట్టె అబ్బె
తేనెలమోవిమఱపు తెలియఁగరాదా

(||pallavi||)
kŏmmalagu manobhāvagum̐ ḍaṁduru
sammadiṁcha māgu diṣhṭamu sūbarādā

(||kŏmma||)
maguva korigalane manasunam̐ bālu dāgĕ
jigi nīvĕnneni lĕkkasĕppavayyā
nagavulagappuramu naṁṭuna berālāḍĕ
vĕgaḍulega nīvu vĕla dīrsarādā

(||kŏmma||)
jalajākṣhi javvanamu sannulam̐ guppalu vosĕ
yĕlamim̐ gorubā laṁdunemayyā
kaligi kannulane kaluvalam̐ būjasesĕ
phala mĕṁta ichchevu pasariṁcharādā

(||kŏmma||)
mānini siggulane marmamulu ninnaḍigi
ānadichchi mĕchchulu nīvaṁdavayyā
pūniga śhrīveṁkaḍeśha pŏṁdulu mīgiṭṭĕ abbĕ
tenĕlamovimaṟabu tĕliyam̐garādā