Kommalaala ammalaala govimdaraaju mee paala

కొమ్మలాల అమ్మలాల గోవిందరాజు మీ పాల
Language

(॥పల్లవి॥)
కొమ్మలాల అమ్మలాల గోవిందరాజు మీ పాల-
నిమ్ములఁ జిక్కున్నవాఁడు యిక నే మమ్మా

(॥కొమ్ము॥)
పరపుమీఁద నూరక పవళించుండుట గాని
నిరతి మీవిభునికి నిద్దుర లేదు
పరగ మీ రిద్దరును పాదములు పిసుకఁగ
సురతమర్మపుఁ గాఁకఁ జొక్కీ నదే

(॥కొమ్మ॥)
వున్నతితోఁ గొలు విచ్చి వుండుట యింతే కాని
కన్నులచూపు మీపైనే కదరమ్మా
మన్ననసతులు మీకు మాట లిట్టె యాడఁ గాను
విన్నవినకుల మెచ్చి విఱ్ఱవీఁగీ నదివో

(॥కొమ్మ॥)
పూఁచి భుజములు మూఁడై పొరలి వుండుట గాని
చాఁచినకరము మీకే సన్న సేసీని
ఆఁచి శ్రీవెంకటగిరి నదె తిరుపతిలోన
రేంచినమోహన గూడె రేయిం బగ లదివో

(||pallavi||)
kŏmmalāla ammalāla goviṁdarāju mī pāla-
nimmulam̐ jikkunnavām̐ḍu yiga ne mammā

(||kŏmmu||)
parabumīm̐da nūraga pavaḽiṁchuṁḍuḍa gāni
niradi mīvibhunigi niddura ledu
paraga mī riddarunu pādamulu pisugam̐ga
suradamarmabum̐ gām̐kam̐ jŏkkī nade

(||kŏmma||)
vunnadidom̐ gŏlu vichchi vuṁḍuḍa yiṁte kāni
kannulasūbu mībaine kadarammā
mannanasadulu mīgu māḍa liṭṭĕ yāḍam̐ gānu
vinnavinagula mĕchchi viṭravīm̐gī nadivo

(||kŏmma||)
pūm̐si bhujamulu mūm̐ḍai pŏrali vuṁḍuḍa gāni
sām̐sinagaramu mīge sanna sesīni
ām̐si śhrīvĕṁkaḍagiri nadĕ tirubadilona
reṁchinamohana gūḍĕ reyiṁ baga ladivo