Kommala javvanamulu koruvattevaa

కొమ్మల జవ్వనములు కోరువట్టేవా
Language

(॥పల్లవి॥)
కొమ్మల జవ్వనములు కోరువట్టేవా
కమ్మర మా కోరికలు గాదెఁ బోసేవా

(॥కొమ్మ॥)
నామనరయనేల నన్ను నీవొరయనేల
యేమీ మాకుచగిరులెంతలెంతలాయనేమి
లేమల చక్కఁదనాలు లెక్కవా సేవా

(॥కొమ్మ॥)
ఎక్కువ నాకనుసోగలెంతలెంతలాయనేమి
కక్కసించి యందులోసుంకముగొనేవా
చక్కని నాగోళ్ళివి సరిగాని బేసిగాని
పక్కన నాతో నీవు పందెమాడేవా

(॥కొమ్మ॥)
చెంతలఁ గూడితి నన్ను శ్రీ వెంకటేశ నా
సంతసపుమోవి లంచముగొనేవా
మంతనాలు నెరుపేవు మరురాజ్యపదవికి
యింతటికి నన్నుఁ బట్టుమేలించేవా

(||pallavi||)
kŏmmala javvanamulu koruvaṭṭevā
kammara mā korigalu gādĕm̐ bosevā

(||kŏmma||)
nāmanarayanela nannu nīvŏrayanela
yemī māgusagirulĕṁtalĕṁtalāyanemi
lemala sakkam̐danālu lĕkkavā sevā

(||kŏmma||)
ĕkkuva nāganusogalĕṁtalĕṁtalāyanemi
kakkasiṁchi yaṁdulosuṁkamugŏnevā
sakkani nāgoḽḽivi sarigāni besigāni
pakkana nādo nīvu paṁdĕmāḍevā

(||kŏmma||)
sĕṁtalam̐ gūḍidi nannu śhrī vĕṁkaḍeśha nā
saṁtasabumovi laṁchamugŏnevā
maṁtanālu nĕrubevu marurājyabadavigi
yiṁtaḍigi nannum̐ baṭṭumeliṁchevā