కొమ్మల జవ్వనములు కోరువట్టేవా
(॥పల్లవి॥)
కొమ్మల జవ్వనములు కోరువట్టేవా
కమ్మర మా కోరికెలు గాదె బోసేవా
(॥కొమ్మల॥)
నామనసు అడుగ నేల నమ్మించ నీ కేల
కోమలపు మాగుణాలు కొలవట్టేవా
యేవి మాకుచగిరు లెంత లెంత లాయ నేమి
లేమల చక్కఁదనాలు లెక్క వ్రాసేనా
(॥కొమ్మల॥)
యెక్కువ మా కనుఁగవ లెంత ఘన మాయ నేమి
కక్కసించి యిందులో సుంకము గొనేవా
చక్కని మాగోళ్ళివి సరి గానీ బేసి గానీ
పక్కన వినియు నాతో పందె మాడేవా
(॥కొమ్మల॥)
మంతనాలు నెరుపేవు మరురాజ్యపదవికి
యింతటికీ నన్నుఁ బట్ట మేలించేవా
చెంతలఁ గడితి విదె శ్రీవేంకటేశ నీవు
సంతనాన గోరి లచ్చన వెట్టేవా
(||pallavi||)
kŏmmala javvanamulu koruvaṭṭevā
kammara mā korigĕlu gādĕ bosevā
(||kŏmmala||)
nāmanasu aḍuga nela nammiṁcha nī kela
komalabu māguṇālu kŏlavaṭṭevā
yevi māgusagiru lĕṁta lĕṁta lāya nemi
lemala sakkam̐danālu lĕkka vrāsenā
(||kŏmmala||)
yĕkkuva mā kanum̐gava lĕṁta ghana māya nemi
kakkasiṁchi yiṁdulo suṁkamu gŏnevā
sakkani māgoḽḽivi sari gānī besi gānī
pakkana viniyu nādo paṁdĕ māḍevā
(||kŏmmala||)
maṁtanālu nĕrubevu marurājyabadavigi
yiṁtaḍigī nannum̐ baṭṭa meliṁchevā
sĕṁtalam̐ gaḍidi vidĕ śhrīveṁkaḍeśha nīvu
saṁtanāna gori lachchana vĕṭṭevā