Komma valabulagellaa guri yaadamdu

కొమ్మ వలపులకెల్లా గురి యాతఁడు
Language

(॥పల్లవి॥)
కొమ్మ వలపులకెల్లా గురి యాతఁడు
నెమ్మది నెచ్చరించరే నెరవేరీఁ బనులు*

(॥కొమ్మ॥)
చందమామ నననేల చల్లగాలి దూరనేల
చెంది పతిఁ దోడితేరే చెలులాల
గంద మెంత మెత్తేరే కప్పుర మేమి చల్లేరే
పొందుసేసి యాతనినే బోదించరే

(॥కొమ్మ॥)
వలరాజుఁ దిట్టనేల వసంతుని గొడవేల
చెలువునికిఁ జెప్పరే చెలులాల
కలువ లెందుకు వచ్చు కడు బన్నీ రేమిటికి
తలపించి యాతనికే దయవుట్ట జెప్పరే

(॥కొమ్మ॥)
కాంత నూరడించనేల కన్నవారి నాడనేల
చెంతఁ బతిఁ గొసరరే చెలులాల
ఇంతట శ్రీవేంకటేశుఁ డీకె నేలె దానె వచ్చి
పంతాన నిద్దరిని సోబానఁ బాడరే

(||pallavi||)
kŏmma valabulagĕllā guri yādam̐ḍu
nĕmmadi nĕchchariṁchare nĕraverīm̐ banulu*

(||kŏmma||)
saṁdamāma nananela sallagāli dūranela
sĕṁdi padim̐ doḍidere sĕlulāla
gaṁda mĕṁta mĕttere kappura memi sallere
pŏṁdusesi yādanine bodiṁchare

(||kŏmma||)
valarājum̐ diṭṭanela vasaṁtuni gŏḍavela
sĕluvunigim̐ jĕppare sĕlulāla
kaluva lĕṁdugu vachchu kaḍu bannī remiḍigi
talabiṁchi yādanige dayavuṭṭa jĕppare

(||kŏmma||)
kāṁta nūraḍiṁchanela kannavāri nāḍanela
sĕṁtam̐ badim̐ gŏsarare sĕlulāla
iṁtaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīgĕ nelĕ dānĕ vachchi
paṁtāna niddarini sobānam̐ bāḍare