Komma simgaaramu livi kolam di vettamga raavu

కొమ్మ సింగారము లివి కొలఁ ది వెట్టఁగ రావు
Language

(॥పల్లవి॥)
కొమ్మ సింగారము లివి కొలఁ ది వెట్టఁగ రావు
పమ్మిన యీ సొబగులు భావించరే చెలులు

(॥॥)
చెలియ పెద్ద తురుము చీఁకట్లు గాయఁ గాను
యెలమి మోముకళలు యెండ గాయఁగా
బలిసి రాతిరియుఁ బగలు వెనకముందై
కలయ కొక్కట మించీఁ గంటిరటే చెలులు

(॥॥)
పొందుగ నీకె చన్నులు పొడవులై పెరుగఁగా
నందమై నెన్నడుము బయలై వుండఁగా
ఇందునే కొండలు మిన్నుఁ గిందుమీఁదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు

(॥॥)
శ్రీ వేంకటేశు వీఁపునఁ జేతు లీకెవి గప్పఁగా
యీవల నీతని చేతు లీకెఁ గప్పఁగా
ఆవలఁ గొమ్మలుఁ దీగె ననలుఁ గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ

(||pallavi||)
kŏmma siṁgāramu livi kŏlam̐ di vĕṭṭam̐ga rāvu
pammina yī sŏbagulu bhāviṁchare sĕlulu

(||||)
sĕliya pĕdda turumu sīm̐kaṭlu gāyam̐ gānu
yĕlami momugaḽalu yĕṁḍa gāyam̐gā
balisi rādiriyum̐ bagalu vĕnagamuṁdai
kalaya kŏkkaḍa miṁchīm̐ gaṁṭiraḍe sĕlulu

(||||)
pŏṁduga nīgĕ sannulu pŏḍavulai pĕrugam̐gā
naṁdamai nĕnnaḍumu bayalai vuṁḍam̐gā
iṁdune kŏṁḍalu minnum̐ giṁdumīm̐dai yŏkkasone
sĕṁdi vunna vivivo sūsidiraḍe sĕlulu

(||||)
śhrī veṁkaḍeśhu vīm̐punam̐ jedu līgĕvi gappam̐gā
yīvala nīdani sedu līgĕm̐ gappam̐gā
āvalam̐ gŏmmalum̐ dīgĕ nanalum̐ gŏnalu nalli
seva derīni tilagiṁchidiraḍe sĕlulū