కొమ్మ నిన్నుఁ బొగడె నీగుణము లెల్లా నెంచి
(॥పల్లవి॥)
కొమ్మ నిన్నుఁ బొగడె నీగుణము లెల్లా నెంచి
యిమ్ముల నీ విద్యలకు నెంత జాణవో
(॥॥)
కాఁపురము సేసేవారిఁ గరుణించా నేరుతువు
చేపట్టి లాలసము సేయనేర్తువు
తీపుల మాటలు నేర్పి తిద్దుకొనా నేరుతువు
యే పొద్దుఁ జెలుల మిఁ క నేమి విన్నవించేము
(॥॥)
కోరినట్టు రతులలోఁ గూడి యుండ నేరుతువు
కూరిమి సేవ సేయించుకొన నేర్తువు
సారె సారె నవ్వు నవ్వి సరసమాడ నేర్తువు
యీరీతిఁ జెలులము యేమి విన్నవించేము
(॥॥)
చిత్తగించి పెండ్లాడి సేసవెట్ట నేరుతువు
కొత్తలుగా మన్నించి కూడ నేర్తువు
బత్తితో నలమేల్మంగపతివి శ్రీ వేంకటేశ
యిత్తల చెలులము నే మేమి విన్నవించేము.
(||pallavi||)
kŏmma ninnum̐ bŏgaḍĕ nīguṇamu lĕllā nĕṁchi
yimmula nī vidyalagu nĕṁta jāṇavo
(||||)
kām̐puramu sesevārim̐ garuṇiṁchā neruduvu
sebaṭṭi lālasamu seyanerduvu
tībula māḍalu nerbi tiddugŏnā neruduvu
ye pŏddum̐ jĕlula mim̐ ka nemi vinnaviṁchemu
(||||)
korinaṭṭu radulalom̐ gūḍi yuṁḍa neruduvu
kūrimi seva seyiṁchugŏna nerduvu
sārĕ sārĕ navvu navvi sarasamāḍa nerduvu
yīrīdim̐ jĕlulamu yemi vinnaviṁchemu
(||||)
sittagiṁchi pĕṁḍlāḍi sesavĕṭṭa neruduvu
kŏttalugā manniṁchi kūḍa nerduvu
battido nalamelmaṁgabadivi śhrī veṁkaḍeśha
yittala sĕlulamu ne memi vinnaviṁchemu.