Komma kemta aasodamo koluvulu seyavachche

కొమ్మ కెంత ఆసోదమో కొలువులు సేయవచ్చె
Language

(॥పల్లవి॥)
కొమ్మ కెంత ఆసోదమో కొలువులు సేయవచ్చె
రమ్మని చేరఁ బిలిచి రతి సేయరాదా

(॥కొమ్మ॥)
చుట్టి చుట్టి నీతో నాకె సుద్దులు చెప్పఁగ వచ్చీ
బట్టబయలెమ్మెలు చూపఁగ వచ్చీని
గుట్టుతో నుండఁగా నీకు కొప్పులు వెట్టఁగవచ్చీ
అట్టె లోనికి బిలిచి అదరించరాదా

(॥కొమ్మ॥)
కమ్మటి నింటిలో నెల్లా కాఁపురాలు దిద్దవచ్చీ
చిమ్మిరేఁచి ఇచ్చాకాలు సేయవచ్చీని
తమ్మిపువ్వు గానుకిచ్చి తలఁపులు చెప్పవచ్చీ
సమ్మతించి ఇయ్యొని చనవియ్యరాదా

(॥కొమ్మ॥)
చలరేఁగి చలరేఁగి సేవలు సేయఁగవచ్చీ
మొలకనవ్వులు నవ్వి మొక్కవచ్చీని
యెలమి నన్నేలితివి యిప్పుడే శ్రీవేంకటేశ
బలిమి నాపెనుఁ గొంత పనిగొనరాదా

(||pallavi||)
kŏmma kĕṁta āsodamo kŏluvulu seyavachchĕ
rammani seram̐ bilisi radi seyarādā

(||kŏmma||)
suṭṭi suṭṭi nīdo nāgĕ suddulu sĕppam̐ga vachchī
baṭṭabayalĕmmĕlu sūbam̐ga vachchīni
guṭṭudo nuṁḍam̐gā nīgu kŏppulu vĕṭṭam̐gavachchī
aṭṭĕ lonigi bilisi adariṁcharādā

(||kŏmma||)
kammaḍi niṁṭilo nĕllā kām̐purālu diddavachchī
simmirem̐si ichchāgālu seyavachchīni
tammibuvvu gānugichchi talam̐pulu sĕppavachchī
sammadiṁchi iyyŏni sanaviyyarādā

(||kŏmma||)
salarem̐gi salarem̐gi sevalu seyam̐gavachchī
mŏlaganavvulu navvi mŏkkavachchīni
yĕlami nannelidivi yippuḍe śhrīveṁkaḍeśha
balimi nābĕnum̐ gŏṁta panigŏnarādā