కొమ్మ గడుజవరాలు కోమలపు మేనిది
(॥పల్లవి॥)
కొమ్మ గడుజవరాలు కోమలపు మేనిది
నెమ్మది నుపలాలించి నెయ్యము చూపరాదా
(॥కొమ్మ॥)
నిలుచుండి మాఁటలాడీ నెలఁత యప్పటనుండి
పిలిచి వద్దఁ గూచుండఁ బెట్టుకోరాదా
బలిసిన చనుఁగవభారము మోచుకున్నది
అలరి నీ భుజముల నానుకొనరాదా
(॥కొమ్మ॥)
నిండుఁ గొప్పు జారఁగానే నీకు విడె మిచ్చీని
అండనుండి గక్కన నీ వందుకోరాదా
మెండుగ వలపు లొడి మెరసి కట్టుకున్నది
దండితో నీవూఁ గొంత తాళుకోరాదా
(॥కొమ్మ॥)
పచ్చి చెమటలుఁ బక పక నవ్వీ నీతో
మచ్చికఁ గాఁగిట నించి మన్నించరాదా
ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివీకె నింతలో
కుచ్చి నీ పాదము లొత్తీఁ గోరి మెచ్చరాదా
(||pallavi||)
kŏmma gaḍujavarālu komalabu menidi
nĕmmadi nubalāliṁchi nĕyyamu sūbarādā
(||kŏmma||)
nilusuṁḍi mām̐ṭalāḍī nĕlam̐ta yappaḍanuṁḍi
pilisi vaddam̐ gūsuṁḍam̐ bĕṭṭugorādā
balisina sanum̐gavabhāramu mosugunnadi
alari nī bhujamula nānugŏnarādā
(||kŏmma||)
niṁḍum̐ gŏppu jāram̐gāne nīgu viḍĕ michchīni
aṁḍanuṁḍi gakkana nī vaṁdugorādā
mĕṁḍuga valabu lŏḍi mĕrasi kaṭṭugunnadi
daṁḍido nīvūm̐ gŏṁta tāḽugorādā
(||kŏmma||)
pachchi sĕmaḍalum̐ baga paga navvī nīdo
machchigam̐ gām̐giḍa niṁchi manniṁcharādā
ichchaḍa śhrīveṁkaḍeśha yelidivīgĕ niṁtalo
kuchchi nī pādamu lŏttīm̐ gori mĕchcharādā