Komku kosarellaam deere kotti baduganeeve

కొంకు కొసరెల్లాఁ దీరె కొట్టి బతుకనీవే
Language

(॥పల్లవి॥)
కొంకు కొసరెల్లాఁ దీరె కొట్టి బతుకనీవే
జంకెనలకెల్లా లోను సాదించుమనవే

(॥కొంకు॥)
ప్రాణమే తనసోమ్మైతే ప్రాయ మేమినేనీనే
ప్రాణేశుఁడట తా నీపాటెఱఁగఁడా
జాణఁడు తనకు నాకు సరికిబేసికి లంకె
ఆణాజ్ఞకు లోను అట్టే సేయుయనచే

(॥కొంకు॥)
తనువే తనసోమ్మైతే తాప మేమిసేసీనే
తనివిఁబొందించీ నింత తా నెఱఁగడా
తనుప్రేమ నాప్రేమ తారుకాణలకు వచ్చె
చెనకులకెల్లా లోను సేంత సేయుమనవే

(॥కొంకు॥)
చిత్తమే తనసోమ్మైతే సిగ్గు లేమి సేసీనే
చిత్తజగురుఁడు తా నీచింతెఱఁగఁడా
అత్తి శ్రీవేంకటేశుఁ డాతఁడే నన్నుఁ గూడె
కోత్త చేఁత కెల్లాలోను కోరితి నే ననవే

(||pallavi||)
kŏṁku kŏsarĕllām̐ dīrĕ kŏṭṭi baduganīve
jaṁkĕnalagĕllā lonu sādiṁchumanave

(||kŏṁku||)
prāṇame tanasommaide prāya meminenīne
prāṇeśhum̐ḍaḍa tā nībāḍĕṟam̐gam̐ḍā
jāṇam̐ḍu tanagu nāgu sarigibesigi laṁkĕ
āṇājñagu lonu aṭṭe seyuyanase

(||kŏṁku||)
tanuve tanasommaide tāba memisesīne
tanivim̐bŏṁdiṁchī niṁta tā nĕṟam̐gaḍā
tanuprema nāprema tārugāṇalagu vachchĕ
sĕnagulagĕllā lonu seṁta seyumanave

(||kŏṁku||)
sittame tanasommaide siggu lemi sesīne
sittajagurum̐ḍu tā nīsiṁtĕṟam̐gam̐ḍā
atti śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe nannum̐ gūḍĕ
kotta sem̐ta kĕllālonu koridi ne nanave