Komkidi namduge konamgonalaa

కొంకితి నందుకే కొనఁగొనలా
Language

(॥పల్లవి॥)
కొంకితి నందుకే కొనఁగొనలా
యింకా నీచిత్త మెట్టున్నదో

(॥కొంకి॥)
కందువ నినుఁగని కన్నుల నవ్వఁగ
అందుకు నెంతటిదనందువో
సందడి నీతో సరసములాడఁగ
మందెమేళమని మతిఁ బెట్టుదువో

(॥కొంకి॥)
చేతుల నీపై చెనకి చిమ్మితే
యేతు లనుచు మఱి యేదుమంవో
కాతరమున నిటు కడుఁబై కొనినను
నీతలఁపుల నేనెపము లెంతువో

(॥కొంకి॥)
నిలువునఁ గాఁగిట నిను నిటు మించిన
కొలఁది మీరె నని కొంతందువో
కలసితి శ్రీవేంకటేశ నన్నిదె
మలయుచు నెటువలె మరులుగొందువో

(||pallavi||)
kŏṁkidi naṁduge kŏnam̐gŏnalā
yiṁkā nīsitta mĕṭṭunnado

(||kŏṁki||)
kaṁduva ninum̐gani kannula navvam̐ga
aṁdugu nĕṁtaḍidanaṁduvo
saṁdaḍi nīdo sarasamulāḍam̐ga
maṁdĕmeḽamani madim̐ bĕṭṭuduvo

(||kŏṁki||)
sedula nībai sĕnagi simmide
yedu lanusu maṟi yedumaṁvo
kādaramuna niḍu kaḍum̐bai kŏninanu
nīdalam̐pula nenĕbamu lĕṁtuvo

(||kŏṁki||)
niluvunam̐ gām̐giḍa ninu niḍu miṁchina
kŏlam̐di mīrĕ nani kŏṁtaṁduvo
kalasidi śhrīveṁkaḍeśha nannidĕ
malayusu nĕḍuvalĕ marulugŏṁduvo