Komkanela yimkanu kommalamu neegunu

కొంకనేల యింకను కొమ్మలము నీకును
Language

(॥పల్లవి॥)
కొంకనేల యింకను కొమ్మలము నీకును
సంకెదేర్చి మామాటకే సమ్మతింతుగాక

(॥కొంక॥)
చనవువారము గాక సరివారమా నేము
మనసేమి చూచేవు మాతోడను
వెనకవారమే మేము వేడుకకాఁడవు నీవే
పనిగొని మమ్మునిట్టె పాలింతు గాక

(॥కొంక॥)
యిచ్చకమాడేము గాక యెదురుమాటాడేమా
వచ్చియేల సేసేవు పలుమారును
మెచ్చితిమప్పుడే నిన్ను మించె నీజాణతనాలు
కచ్చు పెట్టి మమ్మునిట్టె కరుణింతుగాక

(॥కొంక॥)
చుట్టాలమౌదుము గాక సూడుబంట్లమా నేము
రట్టేల మమ్ముఁ జేసేవు ఇట్టె రతివేళను
గుట్టుతో శ్రీ వేంకటేశ కూడితి మిందరమును
వొట్టుక మావద్దఁ బాయకుండుదువుగాక

(||pallavi||)
kŏṁkanela yiṁkanu kŏmmalamu nīgunu
saṁkĕdersi māmāḍage sammadiṁtugāga

(||kŏṁka||)
sanavuvāramu gāga sarivāramā nemu
manasemi sūsevu mādoḍanu
vĕnagavārame memu veḍugagām̐ḍavu nīve
panigŏni mammuniṭṭĕ pāliṁtu gāga

(||kŏṁka||)
yichchagamāḍemu gāga yĕdurumāḍāḍemā
vachchiyela sesevu palumārunu
mĕchchidimappuḍe ninnu miṁchĕ nījāṇadanālu
kachchu pĕṭṭi mammuniṭṭĕ karuṇiṁtugāga

(||kŏṁka||)
suṭṭālamaudumu gāga sūḍubaṁṭlamā nemu
raṭṭela mammum̐ jesevu iṭṭĕ radiveḽanu
guṭṭudo śhrī veṁkaḍeśha kūḍidi miṁdaramunu
vŏṭṭuga māvaddam̐ bāyaguṁḍuduvugāga