Komkaga naavadda nitte koorusumdaraa

కొంకక నావద్ద నిట్టె కూరుచుండరా
Language

(॥పల్లవి॥)
కొంకక నావద్ద నిట్టె కూరుచుండరా
సంకెలల్లాఁ బాపి నిన్ను జాణఁజేసే నిపుడు

(॥కొంక॥)
మొదల నీవే నాకు మోహించవలెఁగాక
అది నాతో మారుకొనే ఆపాటిదా
వొదిగి దానికిఁగా నీవూరకే లోఁగే వింతే
అదన నేనే తీర్చే ఆవెరపు నీకు

(॥కొంక॥)
చనవిచ్చి నీవు నాకు సమ్మతించవలెఁగాక
పెనఁగి యాపె నాతో బీరమాడేదా
చెనకి ఇందుకుఁగాను చింత నీకు నింతయేల
అనుమానమెల్లాఁ బాపే ఆసతిముందరనే

(॥కొంక॥)
ఇటువలె నీవు నన్ను యెనయఁగవలె గాక
సటకారి ఇంతి నాతో సరిదూగేదా
ఘటన శ్రీ వేంకటేశ కాఁగిలించితివి నన్ను
కిటుకులన్నియుఁ బాసె కేరికేరి నవ్వేరా

(||pallavi||)
kŏṁkaga nāvadda niṭṭĕ kūrusuṁḍarā
saṁkĕlallām̐ bābi ninnu jāṇam̐jese nibuḍu

(||kŏṁka||)
mŏdala nīve nāgu mohiṁchavalĕm̐gāga
adi nādo mārugŏne ābāḍidā
vŏdigi dānigim̐gā nīvūrage lom̐ge viṁte
adana nene tīrse āvĕrabu nīgu

(||kŏṁka||)
sanavichchi nīvu nāgu sammadiṁchavalĕm̐gāga
pĕnam̐gi yābĕ nādo bīramāḍedā
sĕnagi iṁdugum̐gānu siṁta nīgu niṁtayela
anumānamĕllām̐ bābe āsadimuṁdarane

(||kŏṁka||)
iḍuvalĕ nīvu nannu yĕnayam̐gavalĕ gāga
saḍagāri iṁti nādo saridūgedā
ghaḍana śhrī veṁkaḍeśha kām̐giliṁchidivi nannu
kiḍugulanniyum̐ bāsĕ kerigeri navverā