కొంగువట్టి తియ్యనేల కోరి బుజ్జగించనేల
(॥పల్లవి॥)
కొంగువట్టి తియ్యనేల కోరి బుజ్జగించనేల
ముంగిటనే వున్నారము మొదల నీవారమే
(॥కొంగు॥)
కులికి నీచూపులకు గురియైనమీఁదట
నిలుచుకవుండినను నీవారమే
పిలిపించి నీవు లోనఁబెట్టుకొన్న మీఁదట
నెలకొని యాడనున్నా నీవారమే
(॥కొంగు॥)
సారె నీవు మాతోను సరసమాడినమీఁద
నేరక మాటాడినాను నీవారమే
చేరి నీవు మాపయిని సేసవెట్టినట్టిమీఁద
నేరక కొసరినాను నీవారమే
(॥కొంగు॥)
భావించి నీకు నేను పడఁతినయినమీఁద
నీవు మమ్ముఁ గూడినాను నీవారమే
శ్రీ వేంకటేశ నన్నుఁ జేరి కూడితి విదివో
నీవిధాలు గన్న మీఁద నీవారమే
(||pallavi||)
kŏṁguvaṭṭi tiyyanela kori bujjagiṁchanela
muṁgiḍane vunnāramu mŏdala nīvārame
(||kŏṁgu||)
kuligi nīsūbulagu guriyainamīm̐daḍa
nilusugavuṁḍinanu nīvārame
pilibiṁchi nīvu lonam̐bĕṭṭugŏnna mīm̐daḍa
nĕlagŏni yāḍanunnā nīvārame
(||kŏṁgu||)
sārĕ nīvu mādonu sarasamāḍinamīm̐da
neraga māḍāḍinānu nīvārame
seri nīvu mābayini sesavĕṭṭinaṭṭimīm̐da
neraga kŏsarinānu nīvārame
(||kŏṁgu||)
bhāviṁchi nīgu nenu paḍam̐tinayinamīm̐da
nīvu mammum̐ gūḍinānu nīvārame
śhrī veṁkaḍeśha nannum̐ jeri kūḍidi vidivo
nīvidhālu ganna mīm̐da nīvārame