Komdavamtidoravu kori seyivattamgaanu

కొండవంటిదొరవు కోరి చెయివట్టఁగాను
Language

(॥పల్లవి॥)
కొండవంటిదొరవు కోరి చెయివట్టఁగాను
కండించి యాడవచ్చునా కానీవయ్యా

(॥కొండ॥)
వలపు చవిచూపితే వద్దనఁగవచ్చునా
చెలఁగి మాయింటికి విచ్చేయవయ్యా
వొలసి విడెమియ్యఁగా నొల్లననవచ్చునా
తిలకించి పుచ్చుకొనేఁ దేవయ్యా

(॥కొండ॥)
సిగ్గులు చేతికిచ్చితే చేత దొబ్బవచ్చునా
వెగ్గళించ నింకఁ దెరవేయవయ్యా
వొగ్గి నవ్వులు నవ్వఁగా నోపననవచ్చునా
నిగ్గుల సమ్మతించితి నీచిత్తమయ్యా

(॥కొండ॥)
జవ్వనము పైఁబూసితే జంకించవచ్చునా
చివ్వనఁ గాఁగిట నించి చేచాఁచవయ్యా
యివ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నివ్వటిల్ల మన్నించి నిండుకుండవయ్యా;

(||pallavi||)
kŏṁḍavaṁṭidŏravu kori sĕyivaṭṭam̐gānu
kaṁḍiṁchi yāḍavachchunā kānīvayyā

(||kŏṁḍa||)
valabu savisūbide vaddanam̐gavachchunā
sĕlam̐gi māyiṁṭigi vichcheyavayyā
vŏlasi viḍĕmiyyam̐gā nŏllananavachchunā
tilagiṁchi puchchugŏnem̐ devayyā

(||kŏṁḍa||)
siggulu sedigichchide seda dŏbbavachchunā
vĕggaḽiṁcha niṁkam̐ dĕraveyavayyā
vŏggi navvulu navvam̐gā nobananavachchunā
niggula sammadiṁchidi nīsittamayyā

(||kŏṁḍa||)
javvanamu paim̐būside jaṁkiṁchavachchunā
sivvanam̐ gām̐giḍa niṁchi sesām̐savayyā
yivvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nivvaḍilla manniṁchi niṁḍuguṁḍavayyā;