కొండవంటిది వలపు కోరి యెందుకైనా వచ్చు
(॥పల్లవి॥)
కొండవంటిది వలపు కోరి యెందుకైనా వచ్చు
దండివయసున నీవు తల కేవు సువ్మిూ
(॥కొండ॥)
దగ్గరియున్న వలపు తరితీపులై యుండు
కగ్గి పాసినవలపు కారమై తోఁచు
వొగ్గిన పొత్తులవల పులివెచ్చలై వుండు
బగ్గన నిందుకు నీవు భ్రమసేవు సుమ్మీ
(॥కొండ॥)
మొల్లమిఁ గొత్తవలపు మునిముంగిటనే వుండు
తొల్లిటి పాఁతవలపు దొంతులై వుండు
పెల్లగు రాచవలపు పెదవులపై నుండు
వెల్లివిరు లిందు కెల్లా వేసరేవు సుమ్మీ
(॥కొండ॥)
తల కెక్కినవలపు దట్టపుఁజీ కటై వుండు
మొలకవలపు వాఁడిముల్లయి వుండు
యెలమితో శ్రీవేంకటేశు డు గలసె నిన్ను
చలివాసె నిందుకుఁగా జడిసేవు సుమ్మీ
(||pallavi||)
kŏṁḍavaṁṭidi valabu kori yĕṁdugainā vachchu
daṁḍivayasuna nīvu tala kevu suvmiూ
(||kŏṁḍa||)
daggariyunna valabu taridībulai yuṁḍu
kaggi pāsinavalabu kāramai tom̐su
vŏggina pŏttulavala pulivĕchchalai vuṁḍu
baggana niṁdugu nīvu bhramasevu summī
(||kŏṁḍa||)
mŏllamim̐ gŏttavalabu munimuṁgiḍane vuṁḍu
tŏlliḍi pām̐tavalabu dŏṁtulai vuṁḍu
pĕllagu rāsavalabu pĕdavulabai nuṁḍu
vĕlliviru liṁdu kĕllā vesarevu summī
(||kŏṁḍa||)
tala kĕkkinavalabu daṭṭabum̐jī kaḍai vuṁḍu
mŏlagavalabu vām̐ḍimullayi vuṁḍu
yĕlamido śhrīveṁkaḍeśhu ḍu galasĕ ninnu
salivāsĕ niṁdugum̐gā jaḍisevu summī