Komda velanettinatti govimdaa ninnum

కొండ వేలనెత్తినట్టి గోవిందా నిన్నుఁ
Language

(॥పల్లవి॥)
కొండ వేలనెత్తినట్టి గోవిందా నిన్నుఁ
గొండించేరు యశోదకు గోవిందా

(॥కొండ॥)
గొల్లెతలు మొక్కేరుగోవిందా నీ-
కొల్లలచీర లిమ్మని గోవిందా
గొల్లు వెన్న దొంగిలఁగ గోవిందా నిన్ను
కొల్లున నవ్వేరు వీరె గోవిందా

(॥కొండ॥)
గోవులఁ గాచేవేళ గోవిందా పిల్లఁ-
గోవిని వలచిరి గోవిందా
గోవాళులై యమునలో గోవిందా నీకు
కోవర మున్నారురా గోవిందా

(॥కొండ॥)
కొట్టేటివుట్లకింద గోవిందా నీతోఁ
గొట్టెవాటై పెనఁగేరు గోవిందా
గుట్టుతో శ్రీవేంకటాద్రిగోవిందా కూడి
గొట్టానఁ బెట్టేరు బత్తి గోవిందా

(||pallavi||)
kŏṁḍa velanĕttinaṭṭi goviṁdā ninnum̐
gŏṁḍiṁcheru yaśhodagu goviṁdā

(||kŏṁḍa||)
gŏllĕdalu mŏkkerugoviṁdā nī-
kŏllalasīra limmani goviṁdā
gŏllu vĕnna dŏṁgilam̐ga goviṁdā ninnu
kŏlluna navveru vīrĕ goviṁdā

(||kŏṁḍa||)
govulam̐ gāseveḽa goviṁdā pillam̐-
govini valasiri goviṁdā
govāḽulai yamunalo goviṁdā nīgu
kovara munnārurā goviṁdā

(||kŏṁḍa||)
kŏṭṭeḍivuṭlagiṁda goviṁdā nīdom̐
gŏṭṭĕvāḍai pĕnam̐geru goviṁdā
guṭṭudo śhrīveṁkaḍādrigoviṁdā kūḍi
gŏṭṭānam̐ bĕṭṭeru batti goviṁdā