Komalabuvaamdamtaam gomki yunnadaanam gaaga

కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁ గాక
Language

(॥పల్లవి॥)
కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁ గాక
నేమానమేమి సేసినా నెంజెరివి దీరునా

(॥కోమ॥)
పలుమారు మాటలాడి పడఁతుల వలపించి
యెలయించే రమణుని నేమి సేసేది
పిలిచి పానుపుమీఁదఁ బెనఁగఁగానే చన్నుల
నెలకొనఁ గుమ్మినాను నెంజెరివి దీరునా

(॥కోమ॥)
నగుతా దగ్గరఁ దీసి నాలిసేసి యేఁచెటి
యెగసక్కెపు విభుని నేమి సేసేదే
మొగము చూడఁగానే ముంగురులు చుట్టి పట్టి
నిగిడి గోర గీరినా నెంజరివి దీరునా

(॥కోమ॥)
మట్టు మీరి నన్నుఁ గూడి మరులుగొలిపినట్టి
యిట్టి శ్రీవేంకటేశ్వరు నేమి సేసేదే
గట్టిగా మోవియాని గంటిసేసి పలుమారు
నెట్టుకొని కొసరక నెంజెరివి దీరునా

(||pallavi||)
komalabuvām̐ḍaṁṭām̐ gŏṁki yunnadānam̐ gāga
nemānamemi sesinā nĕṁjĕrivi dīrunā

(||koma||)
palumāru māḍalāḍi paḍam̐tula valabiṁchi
yĕlayiṁche ramaṇuni nemi sesedi
pilisi pānubumīm̐dam̐ bĕnam̐gam̐gāne sannula
nĕlagŏnam̐ gumminānu nĕṁjĕrivi dīrunā

(||koma||)
nagudā daggaram̐ dīsi nālisesi yem̐sĕḍi
yĕgasakkĕbu vibhuni nemi sesede
mŏgamu sūḍam̐gāne muṁgurulu suṭṭi paṭṭi
nigiḍi gora gīrinā nĕṁjarivi dīrunā

(||koma||)
maṭṭu mīri nannum̐ gūḍi marulugŏlibinaṭṭi
yiṭṭi śhrīveṁkaḍeśhvaru nemi sesede
gaṭṭigā moviyāni gaṁṭisesi palumāru
nĕṭṭugŏni kŏsaraga nĕṁjĕrivi dīrunā