కోమలపుమేని సతిఁ గోరకు మంతేసి
(॥పల్లవి॥)
కోమలపుమేని సతిఁ గోరకు మంతేసి
మోముచూచి కూరిమితో మొక్కీ నీకును
(॥॥)
వుప్పతిల్ల మాటలాడి వూరడించి బాసలిచ్చి
అప్పుడు పెండ్డాడితి వందరిలోన
కొప్పువట్టి తీసి యట్టే కొంగుచుట్టి పట్టుకొని
పిప్పి సేసితివి యింత పిసుకకు మీపెను
(॥॥)
ఆసలెల్లాఁ బుట్టించి ఆయములు చేతనంటి
సేస వెట్టితి వప్పుడు చేచేతను
గాసిగాఁ జన్నులు వట్టి కడుఁజెమటలు రేఁచి
వేసారఁ బెనఁగితివి మోసపుచ్చకిఁకను
(॥॥)
వావులెల్లాఁ జెప్పిచెప్పి వాఁటముగాఁ గాఁగిలించి
చేవదీరఁ గూడితివి శ్రీవేంకటేశ
వేవేలు మన్ననలిచ్చి వింతలెల్లా నేరిపి
కైవసమైతివి యిట్టే కరుణించుమిఁకను
(||pallavi||)
komalabumeni sadim̐ goragu maṁtesi
momusūsi kūrimido mŏkkī nīgunu
(||||)
vuppadilla māḍalāḍi vūraḍiṁchi bāsalichchi
appuḍu pĕṁḍḍāḍidi vaṁdarilona
kŏppuvaṭṭi tīsi yaṭṭe kŏṁgusuṭṭi paṭṭugŏni
pippi sesidivi yiṁta pisugagu mībĕnu
(||||)
āsalĕllām̐ buṭṭiṁchi āyamulu sedanaṁṭi
sesa vĕṭṭidi vappuḍu sesedanu
gāsigām̐ jannulu vaṭṭi kaḍum̐jĕmaḍalu rem̐si
vesāram̐ bĕnam̐gidivi mosabuchchagim̐kanu
(||||)
vāvulĕllām̐ jĕppisĕppi vām̐ṭamugām̐ gām̐giliṁchi
sevadīram̐ gūḍidivi śhrīveṁkaḍeśha
vevelu mannanalichchi viṁtalĕllā neribi
kaivasamaidivi yiṭṭe karuṇiṁchumim̐kanu