కొలువువా రివి గంటే కొల్లున నవ్వుదురు
(॥పల్లవి॥)
కొలువువా రివి గంటే కొల్లున నవ్వుదురు
తిలకించి చూచుకొంటే తిద్దుకొందువు
(॥కొలు॥)
నీమేనివింతచేఁతలు నీడచూచుకోవయ్య
కామినిచెక్కులే నీకు కంచుటద్దాలు
వేమారు నేమనఁబోతే వెంగెమై తోఁచు నీకు
దీమసాన నీవైతే తిద్దుకొందువు
(॥కొలు॥)
వెలఁదిడినజవ్వాది వేరేపూవు గట్టవయ్య
పొలఁతిగుబ్బలే నీకు పూవుగుత్తులు
యెలమి నేమేమనిన యెగసక్కెమై తోఁచు
తెలుసుక నీకునీకే తిద్దుకొందువు
(॥కొలు॥)
యెయ్యేడో ఆఁకలి నీవు యీడఁ దీరుచుకోవయ్య
తొయ్యలిమోవే నీకు దొంతిబోనము
నెయ్యపుశ్రీవేంకటేశ నేనంటే నన్నుఁ గూడితి
తియ్యక వెనకవెల్ల తిద్దుకొందువు
(||pallavi||)
kŏluvuvā rivi gaṁṭe kŏlluna navvuduru
tilagiṁchi sūsugŏṁṭe tiddugŏṁduvu
(||kŏlu||)
nīmeniviṁtasem̐talu nīḍasūsugovayya
kāminisĕkkule nīgu kaṁchuḍaddālu
vemāru nemanam̐bode vĕṁgĕmai tom̐su nīgu
dīmasāna nīvaide tiddugŏṁduvu
(||kŏlu||)
vĕlam̐diḍinajavvādi verebūvu gaṭṭavayya
pŏlam̐tigubbale nīgu pūvuguttulu
yĕlami nememanina yĕgasakkĕmai tom̐su
tĕlusuga nīgunīge tiddugŏṁduvu
(||kŏlu||)
yĕyyeḍo ām̐kali nīvu yīḍam̐ dīrusugovayya
tŏyyalimove nīgu dŏṁtibonamu
nĕyyabuśhrīveṁkaḍeśha nenaṁṭe nannum̐ gūḍidi
tiyyaga vĕnagavĕlla tiddugŏṁduvu