Koluvunnaam dadivo govimdaraaju

కొలువున్నాఁ డదివో గోవిందరాజు
Language

(॥పల్లవి॥)
కొలువున్నాఁ డదివో గోవిందరాజు
కొలఁదిలేని సొమ్ముల గోవిందరాజు

(॥॥)
గారవానఁ బాదములు కాంతలపైఁ బారఁజూఁచి
కూరములు వెదచల్లీ గోవిందరాజు
దీరత సంకుఁజక్రాలతెల్లని కన్నులతోడ
కోరినవరము లిచ్చీ గోవిందరాజు

(॥॥)
దట్టపుంగరాలవేళ్ల దాపలిచెయు వారఁజాఁచి
గుట్టుతో నూరకున్నాఁడు గోవిందరాజు
వొట్టుకొనె వలకేలు వున్నతిశిరసుకింద
కొట్టఁగొన నవ్వులతో గోవిందరాజు

(॥॥)
చిప్పిలుతా నొత్తగిలె శేషునిపడగెనీడ
గొప్పకిరీటముతోడ గోవిందరాజు
అప్పుడే బొడ్డునఁ గనె నజని శ్రీ వేంకటాద్రి-
కుప్పెకటారముతోడ గోవిందరాజు

(||pallavi||)
kŏluvunnām̐ ḍadivo goviṁdarāju
kŏlam̐dileni sŏmmula goviṁdarāju

(||||)
gāravānam̐ bādamulu kāṁtalabaim̐ bāram̐jūm̐si
kūramulu vĕdasallī goviṁdarāju
dīrada saṁkum̐jakrāladĕllani kannuladoḍa
korinavaramu lichchī goviṁdarāju

(||||)
daṭṭabuṁgarālaveḽla dābalisĕyu vāram̐jām̐si
guṭṭudo nūragunnām̐ḍu goviṁdarāju
vŏṭṭugŏnĕ valagelu vunnadiśhirasugiṁda
kŏṭṭam̐gŏna navvulado goviṁdarāju

(||||)
sippiludā nŏttagilĕ śheṣhunibaḍagĕnīḍa
gŏppagirīḍamudoḍa goviṁdarāju
appuḍe bŏḍḍunam̐ ganĕ najani śhrī veṁkaḍādri-
kuppĕgaḍāramudoḍa goviṁdarāju