కొలువులోపలనున్న కొమ్మలెల్లా నవ్వేరు
(॥పల్లవి॥)
కొలువులోపలనున్న కొమ్మలెల్లా నవ్వేరు
కొలఁది మీరకువయ్య గోవిందరాజా
(॥॥)
పాదములొ త్తేయట్టి పడఁతికి నిదివొ
ఆదిగొని చెమరించె నంగమెల్లాను
కాదనక పచ్చడము గప్పి మఱఁగుననె
పోదితో నాపెఁ దనివిబొందిఁచవయ్యా
(॥॥)
సరుసఁ గూచుండినట్టికియకు నిదివొ
సిరులుగాఁ బులుకించె చెక్కులెల్లాను
తెరవేసుకొని సిగ్గుదేరిచి గుట్టుననె
గరిమతో లోలోనె కాఁగిలించవయ్యా
(॥॥)
శ్రీసతికి భూసతికిఁ జేరి కూడఁగ నిదివొ
రాసి నిట్టూర్పులు మిఁచె రతులలోనా
ఆసతోడుత శ్రీ వేంకటాద్రి గోవిందరాజ
లేసుగా నిద్దరిని లాలించఁగదవయ్యా
(||pallavi||)
kŏluvulobalanunna kŏmmalĕllā navveru
kŏlam̐di mīraguvayya goviṁdarājā
(||||)
pādamulŏ tteyaṭṭi paḍam̐tigi nidivŏ
ādigŏni sĕmariṁchĕ naṁgamĕllānu
kādanaga pachchaḍamu gappi maṟam̐gunanĕ
podido nābĕm̐ danivibŏṁdim̐savayyā
(||||)
sarusam̐ gūsuṁḍinaṭṭigiyagu nidivŏ
sirulugām̐ bulugiṁchĕ sĕkkulĕllānu
tĕravesugŏni sigguderisi guṭṭunanĕ
garimado lolonĕ kām̐giliṁchavayyā
(||||)
śhrīsadigi bhūsadigim̐ jeri kūḍam̐ga nidivŏ
rāsi niṭṭūrbulu mim̐sĕ radulalonā
āsadoḍuda śhrī veṁkaḍādri goviṁdarāja
lesugā niddarini lāliṁcham̐gadavayyā