కొలువు సేయించుకొనే గోవిందరాజా
(॥పల్లవి॥)
కొలువు సేయించుకొనే గోవిందరాజా
అలరి వోరుచుకొంటే నందమయ్యా
(॥కొలు॥)
చిగురుమోవులవారు చేరి నీతో మాటాడితే
వొగరువేయకుండునా వొకకొంతైనా
వెగటున విని నీవు వెంగెములు సేసుకొనేవు
నగవు సేసుకొనేదే నయమయ్యా
(॥కొలు॥)
కలువకన్నులవారు కప్పి నిన్నుఁ జూచితేను
చలువ గాకుండునా జవ్వనానకు
లలి నీవందుకును చలములు రేఁచుకొనేవు
పులకించి మెచ్చేదీ బుద్దియౌనయ్యా
(॥కొలు॥)
జక్కవచన్నులవారు సరిఁగాగిలించుకొంటే
ముక్కులు సోఁకకుండునా ముంచి వురము
యిక్కువ శ్రీవేంకటేశ యిందుకుఁగా నలసేవు
చొక్కుచు సంతసించేదే జోకౌనయ్యా
(||pallavi||)
kŏluvu seyiṁchugŏne goviṁdarājā
alari vorusugŏṁṭe naṁdamayyā
(||kŏlu||)
sigurumovulavāru seri nīdo māḍāḍide
vŏgaruveyaguṁḍunā vŏgagŏṁtainā
vĕgaḍuna vini nīvu vĕṁgĕmulu sesugŏnevu
nagavu sesugŏnede nayamayyā
(||kŏlu||)
kaluvagannulavāru kappi ninnum̐ jūsidenu
saluva gāguṁḍunā javvanānagu
lali nīvaṁdugunu salamulu rem̐sugŏnevu
pulagiṁchi mĕchchedī buddiyaunayyā
(||kŏlu||)
jakkavasannulavāru sarim̐gāgiliṁchugŏṁṭe
mukkulu som̐kaguṁḍunā muṁchi vuramu
yikkuva śhrīveṁkaḍeśha yiṁdugum̐gā nalasevu
sŏkkusu saṁtasiṁchede jogaunayyā