Koluvoom jeyimchugonee govimdaraaju

కొలువూఁ జేయించుకొనీ గోవిందరాజు
Language

(॥పల్లవి॥)
కొలువూఁ జేయించుకొనీ గోవిందరాజు
చెలులము యీడనుండే చేరి మొక్కరే

(॥కొలు॥)
పవళించి వున్నవాఁడు పాదాలు చాఁచుకున్నాఁడు
జవళిఁ దనయిద్దరుసతులమీఁద
రవళి గోవిందరాజు రవ్వగా నవ్వులు నవ్వీ
తివిరి యీభావము తెలుసుకోరే

(॥కొలు॥)
చేయిచాఁచుకున్నవాఁడు శిరసెత్తుకున్నాఁడు
చాయల గోవిందరాజు సన్నసేసిని
ఆయములు సోఁకించి అంగనలఁ గరఁగించీ
కాయపుటిచ్చల నూడిగము సేయరే

(॥కొలు॥)
సంకుఁజక్రములవాఁడు చల్లుచున్నాఁడు వలపు
కొంకక శ్రీవేంకటాద్రి గోవిందరాజు
వుంకువగా లోలోనే వువిదలఁ గూడినాఁడు
సంకెలేక వారిలో ముచ్చట వినరే

(||pallavi||)
kŏluvūm̐ jeyiṁchugŏnī goviṁdarāju
sĕlulamu yīḍanuṁḍe seri mŏkkare

(||kŏlu||)
pavaḽiṁchi vunnavām̐ḍu pādālu sām̐sugunnām̐ḍu
javaḽim̐ danayiddarusadulamīm̐da
ravaḽi goviṁdarāju ravvagā navvulu navvī
tiviri yībhāvamu tĕlusugore

(||kŏlu||)
seyisām̐sugunnavām̐ḍu śhirasĕttugunnām̐ḍu
sāyala goviṁdarāju sannasesini
āyamulu som̐kiṁchi aṁganalam̐ garam̐giṁchī
kāyabuḍichchala nūḍigamu seyare

(||kŏlu||)
saṁkum̐jakramulavām̐ḍu sallusunnām̐ḍu valabu
kŏṁkaga śhrīveṁkaḍādri goviṁdarāju
vuṁkuvagā lolone vuvidalam̐ gūḍinām̐ḍu
saṁkĕlega vārilo muchchaḍa vinare