Koluvai vunnaamdu veemde govimdaraaju

కొలువై వున్నాఁడు వీఁడె గోవిందరాజు
Language

(॥పల్లవి॥)
కొలువై వున్నాఁడు వీఁడె గోవిందరాజు
కొలకొల నేఁగి వచ్చె గోవిందరాజు

(॥కొలువై॥)
గొడుగుల నీడల గోవిందరాజు
గుడిగొన్న పడగెల గోవిందరాజు
కుడియడమ కాంతల గోవిందరాజు
కొడిసాగే పవుఁజుల గోవిందరాజు

(॥కొలువై॥)
గొప్పగొప్ప పూదండల గోవిందరాజు
గుప్పేటి వింజామరల గోవిందరాజు
కొప్పుపై చుంగులతోడి గోవిందరాజు
కుప్పికటారముతోడి గోవిందరాజు

(॥కొలువై॥)
గొరబుసింగారాల గోవిందరాజు
కురులు దువ్వించుకొని గోవిందరాజు
తిరుపతిలోనను తిరమై శ్రీవేంకటాద్రిఁ
గురిసీ వరములెల్ల గోవిందరాజు

(||pallavi||)
kŏluvai vunnām̐ḍu vīm̐ḍĕ goviṁdarāju
kŏlagŏla nem̐gi vachchĕ goviṁdarāju

(||kŏluvai||)
gŏḍugula nīḍala goviṁdarāju
guḍigŏnna paḍagĕla goviṁdarāju
kuḍiyaḍama kāṁtala goviṁdarāju
kŏḍisāge pavum̐jula goviṁdarāju

(||kŏluvai||)
gŏppagŏppa pūdaṁḍala goviṁdarāju
guppeḍi viṁjāmarala goviṁdarāju
kŏppubai suṁguladoḍi goviṁdarāju
kuppigaḍāramudoḍi goviṁdarāju

(||kŏluvai||)
gŏrabusiṁgārāla goviṁdarāju
kurulu duvviṁchugŏni goviṁdarāju
tirubadilonanu tiramai śhrīveṁkaḍādrim̐
gurisī varamulĕlla goviṁdarāju