Kolla valabulu salle govimdaraaja ninnu

కొల్ల వలపులు చల్లే గోవిందరాజ నిన్ను
Language

(॥పల్లవి॥)
కొల్ల వలపులు చల్లే గోవిందరాజ నిన్ను
గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ

(॥కొల్ల॥)
గొప్పలు మా చన్ను లివి గోవిందరాజ నిన్ను
కుప్పెలవలె నొత్తీని గోవిందరాజు
కుప్పించి బిగించకు వో గోవిందరాజ మేనఁ
గుప్పళించీ పెంజెమట గోవిందరాజ

(॥కొల్ల॥)
కొనగోరి సతులము గోవిందరాజ పై
కొనిపాదాలు చాఁచేవు గోవిందరాజ
కొనబు మాట లేలోయి గోవిందరాజ నీతో
గునిసి మానే మింక గోవిందరాజ

(॥కొల్ల॥)
కోడెమనసువారము గోవిందరాజ మాపై
గూడలఁ జల్లేవు సిగ్గు గోవిందరాజ
కూడితి శ్రీవేంకటాద్రి గోవిందరాజ యిట్టె
కోడి గూసెఁ దెల్లవారె గోవిందరాజ

(||pallavi||)
kŏlla valabulu salle goviṁdarāja ninnu
gŏllĕdalu navveru goviṁdarāja

(||kŏlla||)
gŏppalu mā sannu livi goviṁdarāja ninnu
kuppĕlavalĕ nŏttīni goviṁdarāju
kuppiṁchi bigiṁchagu vo goviṁdarāja menam̐
guppaḽiṁchī pĕṁjĕmaḍa goviṁdarāja

(||kŏlla||)
kŏnagori sadulamu goviṁdarāja pai
kŏnibādālu sām̐sevu goviṁdarāja
kŏnabu māḍa leloyi goviṁdarāja nīdo
gunisi māne miṁka goviṁdarāja

(||kŏlla||)
koḍĕmanasuvāramu goviṁdarāja mābai
gūḍalam̐ jallevu siggu goviṁdarāja
kūḍidi śhrīveṁkaḍādri goviṁdarāja yiṭṭĕ
koḍi gūsĕm̐ dĕllavārĕ goviṁdarāja