కొలచి నా శాంతమే కోపము చూపీ
(॥పల్లవి॥)
కొలచి నా శాంతమే కోపము చూపీ
చెలు వి(లి?)ది దెలుపరె చెలువుఁ డేమనునో
(॥కొల॥)
మఱి కొసరిన బొమ్మలు ముడివడె నవె
యెఱఁగనిపతిమతి యెట్టుండెనో
పెఱిమకు నగితేఁ బెదవులు గదలెను
తఱి నిందుకుఁ బతి తా నేమనునో
(॥కొల॥)
వుదుటున నడచిన వూర్పులు గిసరెను
యెదుటఁ జెలు లతని కేమనిరో
వదలుఁదురుమిడినవడి మోము మఱలె
తుద రమణుఁ డెంత దూరెనో తాను
(॥కొల॥)
కొనచెయివట్టిన గోరటు నాఁటి
యెనసి యతనిరతి యెట్టుండెనో
ఘనుఁడగు శ్రీవేంకటపతిఁ గూడితి
తననాగుఱుతులు దాఁగనివెట్లో
(||pallavi||)
kŏlasi nā śhāṁtame kobamu sūbī
sĕlu vi(li?)di dĕlubarĕ sĕluvum̐ ḍemanuno
(||kŏla||)
maṟi kŏsarina bŏmmalu muḍivaḍĕ navĕ
yĕṟam̐ganibadimadi yĕṭṭuṁḍĕno
pĕṟimagu nagidem̐ bĕdavulu gadalĕnu
taṟi niṁdugum̐ badi tā nemanuno
(||kŏla||)
vuduḍuna naḍasina vūrbulu gisarĕnu
yĕduḍam̐ jĕlu ladani kemaniro
vadalum̐durumiḍinavaḍi momu maṟalĕ
tuda ramaṇum̐ ḍĕṁta dūrĕno tānu
(||kŏla||)
kŏnasĕyivaṭṭina goraḍu nām̐ṭi
yĕnasi yadaniradi yĕṭṭuṁḍĕno
ghanum̐ḍagu śhrīveṁkaḍabadim̐ gūḍidi
tananāguṟudulu dām̐ganivĕṭlo