Kolamdulu meerina govimdaa

కొలఁదులు మీరిన గోవిందా
Language

(॥పల్లవి॥)
కొలఁదులు మీరిన గోవిందా
పలుదెఱగుల మతి పరగీఁ జుమ్మీ

(॥కొలఁ॥)
యేలితి వప్పుడే యిల్లాండ్లంగా
గోలతనముగలగొల్లెతల
అలఁగాచితివి అఁబోతువలెనే
పాలించ మనసు పారీఁజుమ్మీ

(॥కొలఁ॥)
పెట్టితి సేసలు పెండ్లికూతులఁగా
వొట్టి యచ్చరల కొకమాటే
చుట్టితి పెంచముసోగ నెమలివలె
పెట్టనెమళ్ళను బెరిసేవుసుమ్మీ

(॥కొలఁ॥)
కలసితివి శ్రీవేంకటేశ మమ్మిటు
లలిఁ బట్టపుసతుల మనుచును
యెలమి మమునలో నీఁదులాడితివి
పొలసి యాఁడుమీలఁ బొందేవుసుమ్మీ

(||pallavi||)
kŏlam̐dulu mīrina goviṁdā
paludĕṟagula madi paragīm̐ jummī

(||kŏlam̐||)
yelidi vappuḍe yillāṁḍlaṁgā
goladanamugalagŏllĕdala
alam̐gāsidivi am̐boduvalĕne
pāliṁcha manasu pārīm̐jummī

(||kŏlam̐||)
pĕṭṭidi sesalu pĕṁḍligūdulam̐gā
vŏṭṭi yachcharala kŏgamāḍe
suṭṭidi pĕṁchamusoga nĕmalivalĕ
pĕṭṭanĕmaḽḽanu bĕrisevusummī

(||kŏlam̐||)
kalasidivi śhrīveṁkaḍeśha mammiḍu
lalim̐ baṭṭabusadula manusunu
yĕlami mamunalo nīm̐dulāḍidivi
pŏlasi yām̐ḍumīlam̐ bŏṁdevusummī