Kodimanmathaagaara govimda krshna

కోటిమన్మథాకార గోవింద కృష్ణ
Language

(॥పల్లవి॥)
కోటిమన్మథాకార గోవింద కృష్ణ
పాటించి నీమహిమలే పరబ్రహ్మమాయ

(॥కోటి॥)
ఆకాశమువంటిమేను నమరేమూర్తివి గాన
ఆకాశనదియె నీకు నభిషేకము
మేకొని నీవే నిండుమేఘవర్ణు డవు గాన
నీకు మేఘపుష్పాలే పన్నీరుకాపు

(॥కోటి॥)
చంద్రుఁడు నీమనసులో జనియించె నటుగాన
చంద్రికలు కప్రకాపై సరి నిండెను
యింద్రనీలపుగనులు యిలధరుఁడవు గాన
తంద్ర లేక యాపె చూపే తట్టుపుణుఁ గాయను

(॥కోటి॥)
లక్ష్మీపతివి గాన లాగుల నీ వురముపై
లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాఁగ
పక్ష్మనక్షత్రములే యాభరణహరములు

(||pallavi||)
koḍimanmathāgāra goviṁda kṛṣhṇa
pāḍiṁchi nīmahimale parabrahmamāya

(||koḍi||)
āgāśhamuvaṁṭimenu namaremūrdivi gāna
āgāśhanadiyĕ nīgu nabhiṣhegamu
megŏni nīve niṁḍumeghavarṇu ḍavu gāna
nīgu meghabuṣhpāle pannīrugābu

(||koḍi||)
saṁdrum̐ḍu nīmanasulo janiyiṁchĕ naḍugāna
saṁdrigalu kapragābai sari niṁḍĕnu
yiṁdranīlabuganulu yiladharum̐ḍavu gāna
taṁdra lega yābĕ sūbe taṭṭubuṇum̐ gāyanu

(||koḍi||)
lakṣhmībadivi gāna lāgula nī vuramubai
lakṣhmi yalamelumaṁge lali nīdāḽi
sūkṣhmamai śhrīveṁkaḍeśha sukkalabŏḍavu gām̐ga
pakṣhmanakṣhatramule yābharaṇaharamulu