Kodimanmathaagaara govimda krshna

కోటిమన్మథాకార గోవింద కృష్ణ
Language

(॥పల్లవి॥)
కోటిమన్మథాకార గోవింద కృష్ణ
పాటించి నీమహిమలే పరబ్రహ్మము

(॥కోటి॥)
అకాశమువంటి మేన నమరేమూ ర్తివి గాన
అకాశనదియే నీకు నభిషేకము
మేకొని నీవే నిండుమేఘవర్ణుఁడవు గాన
నీకు మేఘపుష్పాలే పన్నీరుకాపు

(॥కోటి॥)
చంద్రుడు నీమనసులో జనించె నటుగాన
చంద్రికలు కప్రకాపై సరి నిండెను
ఇంద్రనీలపుగనుల యిలధరుఁబడవు గాన
తంద్రలేని యీపె చూపే తట్టు పునుఁగాయను

(॥కోటి॥)
లక్ష్మీపతివిగాన లాగుల నీవురముపై
లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాఁగ
పక్ష్మనక్షత్రములే యాభరణహారములు

(||pallavi||)
koḍimanmathāgāra goviṁda kṛṣhṇa
pāḍiṁchi nīmahimale parabrahmamu

(||koḍi||)
agāśhamuvaṁṭi mena namaremū rdivi gāna
agāśhanadiye nīgu nabhiṣhegamu
megŏni nīve niṁḍumeghavarṇum̐ḍavu gāna
nīgu meghabuṣhpāle pannīrugābu

(||koḍi||)
saṁdruḍu nīmanasulo janiṁchĕ naḍugāna
saṁdrigalu kapragābai sari niṁḍĕnu
iṁdranīlabuganula yiladharum̐baḍavu gāna
taṁdraleni yībĕ sūbe taṭṭu punum̐gāyanu

(||koḍi||)
lakṣhmībadivigāna lāgula nīvuramubai
lakṣhmi yalamelumaṁge lali nīdāḽi
sūkṣhmamai śhrīveṁkaḍeśha sukkalabŏḍavu gām̐ga
pakṣhmanakṣhatramule yābharaṇahāramulu