Kodevayasu vibhumdu kottabemdligoomturunu

కోడెవయసు విభుఁడు కొత్తపెండ్లికూఁతురును
Language

(॥పల్లవి॥)
కోడెవయసు విభుఁడు కొత్తపెండ్లికూఁతురును
జాడతోనే మెలఁగేరు జాణలౌదురు

(॥ఇది॥)
తవిలి యొకరోకరు తమలోనిమాటలు
జవదాఁట లిద్దరును జాణలౌదురు
కవగూడి వయసులు కడివోకుండా మోవుల-
చవులు మరిగినారు జాణలౌదురు

(॥ఇది॥)
ముంగిట నేపొద్దు మొకమొకములు చూచుకొంటా
సంగతిగా నవ్వేరు జాణలౌదురు
చెంగటఁ దొడాఁదొడ జిగి నంటవేసుకొని
సంగడినే కూచున్నారు జాణలౌదురు

(॥ఇది॥)
ఇరవైనరతులను ఇంపులతోఁ గూడికూడి
సతతముఁ జెలఁగేరు జాణలౌదురు
ఇతఁడు శ్రీవేంకటేశుఁ డీకె యలమేలుమంగ
చతురత వెలసేరు జాణలౌదురు

(||pallavi||)
koḍĕvayasu vibhum̐ḍu kŏttabĕṁḍligūm̐turunu
jāḍadone mĕlam̐geru jāṇalauduru

(||idi||)
tavili yŏgarogaru tamalonimāḍalu
javadām̐ṭa liddarunu jāṇalauduru
kavagūḍi vayasulu kaḍivoguṁḍā movula-
savulu marigināru jāṇalauduru

(||idi||)
muṁgiḍa nebŏddu mŏgamŏgamulu sūsugŏṁṭā
saṁgadigā navveru jāṇalauduru
sĕṁgaḍam̐ dŏḍām̐dŏḍa jigi naṁṭavesugŏni
saṁgaḍine kūsunnāru jāṇalauduru

(||idi||)
iravainaradulanu iṁpuladom̐ gūḍigūḍi
sadatamum̐ jĕlam̐geru jāṇalauduru
idam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍīgĕ yalamelumaṁga
sadurada vĕlaseru jāṇalauduru