Kodegaamdu veemdugade govimdaraaju

కోడెకాఁడు వీఁడుగదె గోవిందరాజు
Language

(॥పల్లవి॥)
కోడెకాఁడు వీఁడుగదె గోవిందరాజు
జోడైన సకులుఁ దాను చొక్కుచున్నాఁడు

(॥॥)
పరగఁగ మేలుకొని పవ్వళించివున్నవాఁ డు
సొరిది దేవుళ్లకు చోటిచ్చినాఁడు
యిరవై మోవివిందుల కెదురుచూచున్నాఁ డు
తరుణులరతులెల్లాఁ దలపోయుచున్నాఁ డు

(॥॥)
చెప్పరానిసిరులతో సింగారించుకున్నాఁడు
వుప్పతిల్లుఁ దమకాన నుబ్బుచున్నాఁడు
కుప్పెఁడుజవ్వాది మేనఁ గుప్పళించుకున్నవాఁడు
అప్పసము సరసములాడుచున్నాఁడు

(॥॥)
సారె సారె వలపులు చల్లుకొంటా నున్నవాఁడు
వూరడిం చందరిఁ గలయుచునున్నాఁడు
యీరీతి శ్రీ వేంకటాద్రి నిరవై తిరుపతిలో
కూరిములు నెరపుచు కొలువున్నాఁడు

(||pallavi||)
koḍĕgām̐ḍu vīm̐ḍugadĕ goviṁdarāju
joḍaina sagulum̐ dānu sŏkkusunnām̐ḍu

(||||)
paragam̐ga melugŏni pavvaḽiṁchivunnavām̐ ḍu
sŏridi devuḽlagu soḍichchinām̐ḍu
yiravai moviviṁdula kĕdurusūsunnām̐ ḍu
taruṇularadulĕllām̐ dalaboyusunnām̐ ḍu

(||||)
sĕpparānisirulado siṁgāriṁchugunnām̐ḍu
vuppadillum̐ damagāna nubbusunnām̐ḍu
kuppĕm̐ḍujavvādi menam̐ guppaḽiṁchugunnavām̐ḍu
appasamu sarasamulāḍusunnām̐ḍu

(||||)
sārĕ sārĕ valabulu sallugŏṁṭā nunnavām̐ḍu
vūraḍiṁ saṁdarim̐ galayusununnām̐ḍu
yīrīdi śhrī veṁkaḍādri niravai tirubadilo
kūrimulu nĕrabusu kŏluvunnām̐ḍu